News April 10, 2025
HYDలో ఒక్కసారిగా మారిన వాతావరణం

నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఉప్పల్, ముషీరాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. నగరశివారుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. షాద్నగర్లో అయితే భారీ వర్షం కురిసింది. వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది. కామెంట్ చేయండి
PIC CRD: @prudhvikoppaka
Similar News
News December 6, 2025
మహబూబాబాద్: మూడో విడతలో సర్పంచ్కు 1,185 నామినేషన్లు

మూడో విడత ఎన్నికల్లో డోర్నకల్, గంగారం కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్ మండలాల్లో 169 గ్రామ పంచాయతీల్లో 1,412 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 3వ రోజు నామినేషన్లు ముగిశాయి. సర్పంచ్కు 1,185, స్థానాలకు నామినేషన్లు, వార్డు స్థానాలకు 3,592 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉపసంహరణ, స్క్రూటీని అనంతరం ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి.
News December 6, 2025
మర్రిగూడ: పట్టుబడుతున్నా మారట్లేదు

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న చర్చ నడుస్తోంది. గతంలో పనిచేసిన తహశీల్దార్లు మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్ రవి నాయక్ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించి మర్రిగూడకు మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.
News December 6, 2025
ఖర్చు ఎంతైనా వెనకాడని అభ్యర్థులు..

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. కొందరు భూమలను, బంగారం సైతం తాకట్టు పెడుతున్నారు. ASF జిల్లాలో చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ.15 నుంచి25 లక్షలు ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. పెద్ద జీపీల్లో రూ.20 నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. కొందరు ప్రచారంలో పాల్గొనే వారికి రోజుకు రూ.500 చొప్పున కూలి కట్టి ఇస్తున్నారు.


