News April 16, 2025

HYDలో ఓపెన్ 10th, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు

image

HYD జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్‌ఓ వెంకటాచారి ఆదేశించారు. జిల్లాలో 73 కేంద్రాల్లో 15,068 మంది విద్యార్థులు హాజరవుతారు. సెల్‌ఫోన్‌లను అనుమతించరు. 144 సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి. మౌలిక సదుపాయాలు, బందోబస్తు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

Similar News

News November 27, 2025

HYD: జీవో 46పై హైకోర్టుకు.. రేపు విచారణ

image

హైదరాబాద్‌లో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త వివాదం రాజుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అత్యంత వెనుకబడిన కుల సంఘాలు నేరుగా హైకోర్టు తలుపులు తట్టాయి. రిజర్వేషన్ అమలు విధానాన్ని పునఃపరిశీలించాలంటూ అత్యవసర విచారణ కోరగా, బీసీలలో వర్గాలవారీగా న్యాయం చేయాలన్న వాదనలతో న్యాయస్థానం దృష్టి మరలింది. ఈ అంశంపై రేపు విచారణ చేపట్టనున్నట్టు సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.

ఐబొమ్మ రవి: కస్టడీల పరంపర కొనసాగుతుందా?

image

ఐబొమ్మ రవిని పోలీసులు మరో కేసులో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీలో విచారించనున్నారు. ఈ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపనున్నట్లు తెలిసింది. రవిపై మొత్తం 5 కేసులు నమోదుచేశారు. ఈ కేసులన్నింటినీ విచారణ జరపాలంటే కస్టడీలోకి తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారుల భావన. దీంతో మొత్తం కేసుల్లోనూ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుంటారని తెలుస్తోంది.