News November 14, 2024
HYDలో కిలో చికెన్ రూ.162

HYDలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత నెల రోజులుగా మాంసం KG రూ. 200కు పైగానే పలికింది. కార్తీక మాసం 2వ వారంలో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. గతవారం స్కిన్‌లెస్ రూ. 234 నుంచి రూ. 245, విత్ స్కిన్ రూ. 200 నుంచి రూ. 215 మధ్య విక్రయించారు. గురువారం స్కిన్ లెస్ KG రూ. 185, విత్ స్కిన్ రూ. 162కి పడిపోయింది. కార్తీక మాసంలో మాంసానికి దూరంగా ఉండడంతో గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
SHARE IT
Similar News
News October 27, 2025
జూబ్లీహిల్స్ నుంచే BRS శవయాత్ర: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ నుంచే BRS జైత్రయాత్ర అంటోన్న KTRకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ‘జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ శవయాత్ర మొదలైతది కేటీఆర్. ఏ ఇంటికి పోయినా పదేండ్లలో మీరు ఎగ్గొట్టిన హామీలే గుర్తుకొస్తాయి. మీ ముఖాలు చూసి ఇంకా ఎవరైనా ఓటు వేస్తారా?. జూబ్లీహిల్స్‌లోనే మీకు సమాధి. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దాకా మీ పార్టీ ఉంటదా?’ అంటూ INCTelangana అధికారిక అకౌంట్‌లో ట్వీట్ చేసింది. దీనిపై మీ కామెంట్?
News October 26, 2025
చంచల్‌గూడ జైలుకు 150 ఏళ్ల చరిత్ర

చంచల్‌గూడ జైలు 1876లో నిర్మించబడింది. ఈ జైలుకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని నేరస్తులుగా ముద్ర వేసి క్రమశిక్షణ పేరుతో అణచివేయడం జరిగేది. నవాబులు తమకు విరోధంగా ఉన్నవారిని ఇక్కడ నిర్బంధించేవారు. అప్పట్లో 70 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలు కాలక్రమంలో సంస్కరణలు, నగర విస్తరణ కారణంగా ప్రస్తుతం సుమారు 30 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.
News October 26, 2025
HMDA పునర్వ్యవస్థీకరణ..జోనింగ్ పై FOCUS

HYD మహానగర అభివృద్ధి సంస్థ HMDA పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. నగర పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు RRR వరకు విస్తరించిన పరిధిలో ఘట్‌కేసర్, శంషాబాద్, శంకరపల్లి 1-2, మేడ్చల్ 1-2 జోన్లను విభజించి, ప్రతి జోన్‌లో ప్రత్యేక అధికారులు, సాంకేతిక సిబ్బందిని నియమించే అవకాశముంది. ముఖ్యంగా జోనింగ్ పై ఫోకస్ పెట్టింది


