News February 26, 2026
HYDలో కీలక IAS అధికారుల బదిలీ

రాష్ట్రవ్యాప్తంగా IASల బదిలీలు జరిగాయి. ఇందులో GHMCకి జోనల్ కమిషనర్లుగా ఇద్దరు వచ్చారు. రాజేంద్రనగర్ ZC అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా వెళ్లారు. ఆయన స్థానంలో మంద మకరందు ఛార్జ్ తీసుకోనున్నారు. కుత్బుల్లాపూర్ ZCగా పింకేశ్ కుమార్ నియమితులయ్యారు. ZC సందీప్ కుమార్ ఝా జనగామ కలెక్టర్‌గా వెళ్లారు. TGSPDCL సీఎండీని 3వ డిస్కం CMDగా బదిలీచేశారు. కొత్త సీఎండీగా జితేశ్ విపాటిల్ రానున్నారు.
Similar News
News April 19, 2026
పరదేశిపుట్టుకు 15 రోజుల్లో కరెంటు సౌకర్యం కల్పిస్తాం: కలెక్టర్

పెదబయలు మండలంలోని దూలపల్లి, పరదేశిపుట్టు గ్రామాల్లో శనివారం కలెక్టర్ టీ.నిశాంతి పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ లేదని తెలుసుకొని, అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. పరదేశిపుట్టు గ్రామంలో పాఠశాల భవనం, బ్రిడ్జి నిర్మాణ పనులకు అనుమతులు మంజూరు చేశారు. 15 రోజుల్లో గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పిస్తామన్నారు.
News April 19, 2026
సంగారెడ్డి ఏఎస్పీగా చైతన్య రెడ్డి

సంగారెడ్డి ఏఎస్పీగా చైతన్య రెడ్డి ప్రభుత్వం నియమించింది. కామారెడ్డి జిల్లా అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ బి.చైతన్య రెడ్డి పదోన్నతి పొందారు. ఆమె కామారెడ్డిలో పనిచేసిన కాలంలో శాంతిభద్రతల పరిరక్షణలో, ‘అరైవ్ అలైవ్’ వంటి సామాజిక కార్యక్రమాల్లో ఆమె చురుకైన పాత్ర పోషించారు. పదోన్నతి పొందిన చైతన్య రెడ్డికి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
News April 19, 2026
CSK చెత్త రికార్డ్

IPL: SRHతో నిన్న ఓడిన చెన్నై జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2019 నుంచి 180+ స్కోరును ఒక్కసారి కూడా ఛేదించలేకపోయింది. అప్పటి నుంచి CSK జట్టుకు 14 సార్లు 180+ లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం రాగా అన్నింటిలోనూ ఓడింది. మరోవైపు HYDలోని ఉప్పల్ స్టేడియంలో CSK 8 ఏళ్లుగా ఒక్క గెలుపునూ నమోదు చేయలేకపోయింది. ఇక ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచుల్లో రెండింటిలోనే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 7వ స్థానంలో ఉంది.


