News October 7, 2024

HYDలో కోటికి చేరనున్న వాహనాల సంఖ్య!

image

HYDలో రాబోయే పదేళ్లలో వాహనాల సంఖ్య కోటి దాటనుందని నిపుణులు అంచనా వేశారు. కానీ.. ఆ స్థాయిలో రోడ్లు విస్తరణకు, నిర్మాణానికి నోచుకోక, ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్య నివారణకు ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమిటీకి’ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నడుంబిగించారు. ట్రాఫిక్, ఐటీ విభాగాల అదనపు కమిషనర్లు ఈ కమిటీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు.

Similar News

News December 9, 2025

తెలంగాణలో సల్మాన్ ఖాన్ వెంచర్స్

image

సల్మాన్ ఖాన్ వెంచర్స్ తెలంగాణలో రూ.10,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయనుంది. తెలంగాణ రైజింగ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రకటనలలో ఇది ఒకటి. ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ఆవిష్కరించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ లగ్జరీ హాస్పిటాలిటీ, అనుభవపూర్వక విశ్రాంతి, క్రీడా మౌలిక సదుపాయాలు, పూర్తి స్థాయి ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థను మిళితం చేస్తుంది.

News December 9, 2025

HYD: సిటీలో నీటిని తోడేస్తున్నారు!

image

మహానగరంలో భూగర్భజలాలను యథేచ్ఛగా వాడేస్తున్నారు. వాడాల్సిన నీటి కంటే ఎక్కువ తోడుతూ భూగర్భాన్ని ఖాళీ చేస్తున్నారు. భూమిలో ఇంకే నీటి కంటే వాడేనీరే అధికంగా ఉంటోంది. సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, చార్మినార్, గోల్కొండ, అంబర్‌పేట, ఖైరతాబాద్, అసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వాడకం మరీ ఎక్కువగా ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌‌మెంట్ తేల్చింది.

News December 9, 2025

HYD: ఇపుడు 69.. తర్వాత 152.. ఫ్యూచర్‌లో 400 KM!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపాలిటీల విలీనం తరువాత విస్తీర్ణం భారీగా పెరిగింది. దీంతో రవాణా అవసరాలు కూడా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహానగరంలో మెట్రో రైలును కూడా మహానగర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల నెట్ వర్క్ ఉన్న మెట్రో రెండో దశలో మరో 152 KM పెరిగే అవకాశముంది. 2047 నాటికి మెట్రోను 400 KM పెంచి 623 KMకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.