News August 28, 2024
HYDలో గణేశుడిని నిలబెట్టేవారికి గుడ్న్యూస్

వినాయకచవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఇప్పటికే నిర్వాహకులకు ఉన్నతాధికారులు సూచనలు చేశారు. ఈ మేరకు https://policeportal.tspolice.gov.in/indxNew1.htm?ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్గనైజర్లు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయాలి. అనంతరం సంబంధిత పీఎస్లో సంప్రదిస్తే పర్మిషన్ ఇచ్చేస్తారు. విగ్రహం ఎత్తు, రూట్ మ్యాప్ తదితర వివరాలను పొందుపర్చండి. ఇప్పుడే అప్లై చేసుకోండి.
Similar News
News October 25, 2025
HYD: స్వచ్ఛ భారత్ మిషన్లో పాల్గొననున్న GHMC

స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన స్వచ్ఛ షహర్ జోడి కార్యక్రమంలో భాగంగా HYD మెంటర్ నగరంగా GHMC ముందుకొచ్చింది. ఈ మెరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తగిన విధంగా చర్యలు చేపట్టనున్నారు. వివిధ పట్టణాల్లో సర్వే సైతం చేపట్టనున్నట్లు తెలిపారు.
News October 25, 2025
HYD: అవయవదానం కోసం పేరు నమోదు చేసుకోండి..!

HYDలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అవయవదానానికి సంబంధించి ముందుగా పేరు నమోదు చేసుకోవచ్చు. యువత ఆన్లైన్ ద్వారా jeevandan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి, డోనర్ కార్డు అనే ఆప్షన్పై క్లిక్ చేసి, వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. తర్వాత డోనర్ డిజిటల్ కార్డును ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా చేరవేస్తామని వెల్లడించారు.
News October 25, 2025
HYD: ఉస్మానియా ఆసుపత్రిలో టెలీ కమ్యూనికేషన్ సేవలు..!

ఉస్మానియా ఆసుపత్రి వేదికగా టెలీ కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యం 80 నుంచి 100 మంది వరకు ఇది వినియోగించుకుంటున్నట్లుగా అధికారులు తెలియజేశారు. అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ప్రాథమిక వైద్య సేవల మినహా, ఏవైనా స్పెషాలిటీ అవసరమైతే, టెలీ సేవలను అందిస్తున్నారు. మధుమేహ, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు తదితర సేవలు అందిస్తున్నారు.


