News April 7, 2025

HYDలో గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం

image

HYDలో గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బోర్డు ఛైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన GRMB సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఈఎన్‌సీలు హాజరయ్యారు. వీటిలో పలు అంశాలపై చర్చించారు.

Similar News

News December 3, 2025

‘సంచార్ సాథీ’పై వెనక్కి తగ్గిన కేంద్రం

image

సంచార్ సాథీ యాప్‌పై కేంద్రం వెనక్కి తగ్గింది. మొబైళ్లలో ప్రీ <<18439451>>ఇన్‌స్టాలేషన్<<>> తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. సాథీ యాప్‌ను అన్ని కొత్త మొబైళ్లలో ప్రీ ఇన్‌స్టాలేషన్ చేస్తామన్న కేంద్రం ప్రకటనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశ పౌరులపై నిఘా పెట్టేందుకే ఈ యాప్ తెస్తోందని, ఇది ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో యాప్ ప్రీ ఇన్‌స్టాలేషన్ తప్పనిసరి కాదని కేంద్రం పేర్కొంది.

News December 3, 2025

ఎచ్చెర్ల: లా కోర్సు మిగులు సీట్లు భర్తీ వాయిదా

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల లా కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం డిసెంబర్ 4 న చేపట్టనున్న స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను వాయిదా పడింది. ఈ మేరకు రిజిస్ట్రార్ అడ్డయ్య ప్రకటన విడుదల చేశారు. లా కోర్సు స్పాట్ అడ్మిషన్స్లో భాగంగా గురువారం విద్యార్థుల సర్టీఫికేట్ల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. విశ్వవిద్యాలయం తదుపరి తేదీ ప్రకటించే పరిశీలనను వాయిదా వేస్తున్నామన్నారు.

News December 3, 2025

కడప: నవంబరులో తగ్గిన మద్యం ఆదాయం

image

కడప జిల్లాలో మద్యం ఆదాయం నవంబరులో భారీగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యంత కనిష్ఠ స్థాయిలో రూ.83.38 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.101.31 కోట్లు, మేలో రూ.98.90 కోట్లు, జూన్‌లో రూ.97.31 కోట్లు, జూలైలో రూ.96.47 కోట్లు, ఆగస్ట్‌లో రూ.96.42 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.93.36 కోట్లు, అక్టోబర్‌లో రూ.93.44 కోట్లు, నవంబర్‌లో రూ.83.38 కోట్లు ఆదాయం వచ్చింది.