News August 8, 2024

HYDలో గ్రామాల విలీనంపై‌ కసరత్తులు!

image

ORR లోపలున్న పట్టణాలు, నగరాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ORRకి అటూ ఇటూ ఉన్న పట్టణాల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం బాహ్యవలయ రహదారికి వెలుపల ఉన్న గ్రామాలను విలీనం చేయకూడదు. ఆయ గ్రామాలను ఎలా విలీనం చేయాలనే దానిపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

Similar News

News October 15, 2025

ఓయూ రిజిస్ట్రార్‌కు ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు

image

ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డికి ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు లభించింది. ద ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్(ఐఏఏ) నిర్వహించిన 47వ ఆల్ ఇండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జనార్దన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్(డీమ్డ్ యూనివర్సిటీ)లో ఈనెల 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరిగింది.

News October 15, 2025

HYD: సనత్‌నగర్‌లో గన్, తల్వార్‌ సీజ్

image

హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో గన్‌తో హల్‌చల్ చేస్తున్న చంద్రకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకాంత్ గన్, తల్వార్‌తో కొంతకాలంగా కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు అతడి నుంచి గన్, తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

News October 15, 2025

హైదరాబాద్‌: లోన్ ఆఫర్ కాల్స్‌తో జాగ్రత్త

image

హైదరాబాద్‌లో ఫేక్ ఎన్‌జీఓ లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బేగంపేట‌కు చెందిన ఓ వ్యక్తి(30) రూ. 7.9 లక్షలు మోసపోయాడు. హెచ్‌వైసీ ఫౌండర్ సల్మాన్ ఖాన్ డీపీతో వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి.. రూ.50 లక్షల లోన్ ఇస్తానని నమ్మించి, పలు ఫీజుల పేరుతో రూ. 7.9 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపరిచిత లోన్ ఆఫర్లను నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.