News March 28, 2025

HYDలో గ్రీన్ బిల్డింగ్.. పెరుగుతున్న ఆసక్తి..!

image

HYDలో గ్రీన్ బిల్డింగ్స్ వైపు ప్రజల ఆసక్తి పెరుగుతుంది. దీంతో ముఖ్యంగా కోకాపేట, హైటెక్ సిటీ, చందానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో సివిల్ ఇంజినీర్లు గ్రీన్ బిల్డింగ్స్ డిజైన్స్ అమలు చేస్తున్నారు. వీటితో కరెంటు ఆదా, అనుకూల వాతావరణం, గ్రీనరీ, గుడ్ లుకింగ్ ఆర్కిటెక్చర్, వర్షపు నీటి వినియోగం, వాటర్ రీసైకిల్ చేసి మొక్కలకు అందించడం, గాలి నాణ్యత సైతం బాగుంటుందని ఇంజినీర్లు తెలిపారు.

Similar News

News November 12, 2025

కోనసీమ: టెన్త్ విద్యార్థులకు alert..షెడ్యూల్ విడుదల

image

2025-26 విద్యాసంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైనట్లు డీఈవో సలీంబాషా తెలిపారు. రెగ్యులర్, ఫెయిల్ అయిన వారు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 13 – 25 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 3 వరకు చెల్లించవచ్చన్నారు.

News November 12, 2025

APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<>CCRAS<<>>) 5 కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 21న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. BAMS, MD, MS(ఆయుర్వేదం), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. https://ccras.nic.in/

News November 12, 2025

సిద్దిపేట: దయ జూపరా మాపై కొడుకా!

image

అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు మిట్టపల్లి వెంకటయ్య, లక్ష్మి తమ ఇద్దరు కుమారులు బాగోగులు చూసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించిన 8 ఎకరాల భూమిని ఇద్దరికీ రెండు భాగాలుగా పంచి ఇచ్చినప్పటికీ ఎవరు కూడా చూడడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తిండి పెట్టాలని అడిగినందుకు కొట్టి, కాళ్లు విరగొట్టారని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.