News March 28, 2025

HYDలో గ్రీన్ బిల్డింగ్.. పెరుగుతున్న ఆసక్తి..!

image

HYDలో గ్రీన్ బిల్డింగ్స్ వైపు ప్రజల ఆసక్తి పెరుగుతుంది. దీంతో ముఖ్యంగా కోకాపేట, హైటెక్ సిటీ, చందానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో సివిల్ ఇంజినీర్లు గ్రీన్ బిల్డింగ్స్ డిజైన్స్ అమలు చేస్తున్నారు. వీటితో కరెంటు ఆదా, అనుకూల వాతావరణం, గ్రీనరీ, గుడ్ లుకింగ్ ఆర్కిటెక్చర్, వర్షపు నీటి వినియోగం, వాటర్ రీసైకిల్ చేసి మొక్కలకు అందించడం, గాలి నాణ్యత సైతం బాగుంటుందని ఇంజినీర్లు తెలిపారు.

Similar News

News April 24, 2025

సంగారెడ్డి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై చర్యలు: ఐజీ

image

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిన్నారంలో 19న కొన్ని కోతులు గుట్టపై శివుని విగ్రహం కింద పడేయడంతో ధ్వంసమైనట్లు విచారణ తేలిందన్నారు. 22న గేమ్స్ ఆడుకొని శివాలయం వైపు వెళ్తున్న మదార్సా విద్యార్థులను చూసి కొందరు ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. 

News April 24, 2025

ఏప్రిల్ 24: చరిత్రలో ఈరోజు

image

✒ 1929: ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ జననం
✒ 1934: నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జననం
✒ 1969: జ్యోతిష పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం
✒ 1973: మాజీ క్రికెటర్ సచిన్ జననం
✒ 1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది
✒ 2011: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా మరణం

News April 24, 2025

భద్రాచలంలో 43.1°C అత్యధిక ఉష్ణోగ్రత

image

జిల్లాలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా భద్రాచలంలో 43.1°C ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా దమ్మపేటలో 39.1°C ఉష్ణోగ్రత నమోదైంది. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం మండలాల్లో 43°C, కరకగూడెంలో 42.9°C, చుంచుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, మణుగూరు మండలాల్లో 42.7°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

error: Content is protected !!