News September 14, 2024
HYDలో చదివి.. సుప్రీంకోర్టు ASGగా నియామకం!

రామంతపూర్ HYD పబ్లిక్ స్కూల్లో చదివిన 1987 బ్యాచ్ ఎస్.ద్వారకనాథ్ సుప్రీం కోర్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ (ASG)గా నియమితులయ్యారు. HYDలో చదివి సీనియర్ న్యాయమూర్తి స్థాయి నుంచి ASG స్థాయికి వెళ్లడం తమకు ఎంతో గర్వంగా ఉందని HPS బృందం, ద్వారకానాథ్ తెలియజేశారు. HYD పబ్లిక్ స్కూల్లో చదివిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ముఖ్య పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News November 12, 2025
జూబ్లీహిల్స్: ‘కంపల్సరీ ఓటు’ చట్టం తెస్తే తప్ప మారరేమో..!

ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవాలంటే ఓటు వేయండని ప్రభుత్వాలు, ఈసీ చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం. కేవలం 48.49 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కనీసం 50 శాతం కూడా దాటలేదు. ఇలా అయితే సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాల్సిందే అనే చట్టం తీసుకురావాలేమో.. అప్పుడైనా మన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారేమో ఏమంటారు?
News November 12, 2025
జూబ్లీహిల్స్: ‘మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత..?’

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగియడంతో గెలుపు అవకాశాలపై కాంగ్రెస్, BRS, BJP నేతలు చర్చలు జరుపుతున్నారు. ‘షేక్పేట్, బోరబండ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, రహమత్నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ డివిజన్లలో మన పార్టీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి.. మనం గెలుస్తామా.. మెజార్టీ ఎంత వస్తుంది.. పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగిందా’ అంటూ లోకల్ నేతలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 12, 2025
HYD: సీఐడీ విచారణకు సినీ నటులు

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ విచారణ వేగం పెంచింది. నిన్న నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు, నేడు నటుడు ప్రకాశ్రాజ్ను విచారణకు పిలిపించారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రమోషన్ వివరాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత 10 రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.


