News September 14, 2024
HYDలో చదివి.. సుప్రీంకోర్టు ASGగా నియామకం!
రామంతపూర్ HYD పబ్లిక్ స్కూల్లో చదివిన 1987 బ్యాచ్ ఎస్.ద్వారకనాథ్ సుప్రీం కోర్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ (ASG)గా నియమితులయ్యారు. HYDలో చదివి సీనియర్ న్యాయమూర్తి స్థాయి నుంచి ASG స్థాయికి వెళ్లడం తమకు ఎంతో గర్వంగా ఉందని HPS బృందం, ద్వారకానాథ్ తెలియజేశారు. HYD పబ్లిక్ స్కూల్లో చదివిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ముఖ్య పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News October 3, 2024
HYD: పోలీసుల సూచనలు.. ఇలా చేస్తే SAFE!
✓క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్ లైన్ బ్యాంకింగ్, కంప్యూటర్, మొబైల్ లాంటి వాటి పాస్వర్డ్ తరచుగా మార్చుకోవాలి
✓పాస్వర్డ్ పెట్టేముందు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండేలా చూసుకోవాలి
✓పాస్వర్డ్ వివరాలను ఎంత దగ్గర వారికైనా చెప్పొద్దు
✓ఫేక్ మెసేజ్ లింకులు, మెయిల్స్, కాల్స్ పై స్పందించకండి.
✓సైబర్ నేరంగా గుర్తిస్తే 1930కు కాల్ చేయండి
•పై సూచనలు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చేశారు.
News October 3, 2024
HYD: గుడ్డిగా నమ్మితే నట్టేట మునుగుతారు.. జాగ్రత్త!
‘కర్ణుడి చావుకు సవాలక్ష’ కారణాలు అన్నట్టు HYDలో సైబర్ నేరాలతో రూ.కోట్లు మోసపోతున్న పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక వడ్డీతో ఆశ చూపటం, ట్రేడింగ్, కస్టమర్ కాల్ సెంటర్, హెల్ప్ లైన్ పేరిట, హై ప్యాకేజీ జాబ్, OTP మోసాలు, ఫేక్ లింకులు, ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, ఉచిత విదేశీ ప్రయాణాలు, మ్యాట్రిమోనీ పేరిట మాయ మాటలు చెప్పి నట్టేట ముంచి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. జర జాగ్రత్త!
News October 3, 2024
HYD: తోపుడు బండి, ఫుడ్ కోర్టు పెట్టారా..?మీకోసమే
✓తోపుడు బండ్ల నిర్వాహకులు చేతికి గ్లౌజులు, నెత్తిన టోపీ ధరించాలి
✓దుమ్ము అధికంగా ఉన్నచోట, మురుగు కాలువల పక్కన ఆహారం విక్రయించవద్దు
✓ఆహార పదార్థాలపై మూతలు తప్పనిసరి
✓ కవర్లలోకి గాలిని నోటితో ఊదవద్దు
✓ కూరగాయలు, ఉల్లిగడ్డలు ముందు రోజు కోసి నిల్వ ఉంచొద్దు
✓శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి
•HYD తార్నాక NIN ఈమేరకు సూచనలు చేసింది.