News February 4, 2025

HYDలో ట్రాఫిక్ రద్దీ.. ముందుకు కదలని బండి..!

image

మహానగరంలో రద్దీ వేళల్లో 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే దాదాపు 32 నిమిషాల సమయం పడుతుందని ఇంటర్నేషనల్ సంస్థ టామ్ టామ్ వెల్లడించింది. SMTI ట్రాఫిక్ సర్వే నిర్వహించి ఈ విషయాలను వివరించింది. HYD‌కు జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు వచ్చినట్లు తెలిపింది. దేశ, విదేశాల్లోనూ ఈ సర్వే చేపట్టింది. సర్వే రిపోర్టును బట్టి HYDలో రద్దీ సమయాల్లో బండి గంటకు 19KM వేగానికి మించట్లేదు.

Similar News

News January 15, 2026

కర్నూలు: ‘యువకుడి మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే చెప్పండి’

image

కర్నూలు(M) పంచలింగాల డెయిరీ ఫారం నిర్వహిస్తున్న బ్రహ్మానంద రెడ్డి(30) నిన్న తెల్లవారుజామున నుంచి కనిపించకుండా పోయాడు. రోజూలాగే పాలు పోసేందుకు వెళ్లిన బ్రహ్మానంద రెడ్డి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. కేసీ కెనాల్ సమీప హైవేపై అతని బైక్ నిలిపి ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు 4వ పట్టణ PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ విక్రమ్ సింహ తెలిపారు.

News January 15, 2026

మార్స్ కోసం ఆహారం.. రూ.6.75 కోట్ల ఆఫర్

image

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్: మార్స్ టు టేబుల్’ అనే ఛాలెంజ్‌ను ప్రారంభించింది. మార్స్‌కి ప్రయాణించే ఆస్ట్రోనాట్ల కోసం వేరే గ్రహంపై కూడా పెరిగి, వండుకొని తినగలిగే ఆహారం రూపొందించే వారికి 7.5 లక్షల డాలర్లు (సుమారు రూ.6.75 కోట్లు) ఇస్తామని NASA ప్రకటించింది. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలని సూచించింది. ప్రపంచంలోని ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపింది.

News January 15, 2026

టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ

image

NZతో జరిగే 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరమయ్యారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్.. ఇప్పుడు టీ20లకు సైతం అందుబాటులో ఉండటం లేదు. జనవరి 21 నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న T20 వరల్డ్‌కప్‌కు ముందు ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది.