News March 28, 2025

HYDలో తగ్గిన ఇళ్ల కొనుగోళ్లు: KTR

image

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో HYDలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని KTR Xలో ఆరోపించారు. పేదల ఇళ్లమీదకు బుల్డోజర్‌లు పంపి పెద్దలతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.‘గత త్రైమాసికంలో 49% ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్‌ల లీజింగ్ కూడా పాతాళానికి పడిపోయింది. ఈ ఏడాది 3 నెలల్లో కొనుగోళ్లు 41% తగ్గాయి. ప్రభుత్వం అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి, కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోవాలి’ అని రాసుకొచ్చారు.

Similar News

News April 5, 2025

సీతమ్మ తల్లికి సిరిసిల్ల నుంచి బంగారు పట్టు చీర

image

భద్రాచలంలో జరగనున్న సీతారాముల కళ్యాణానికి ఒక భక్తుడు బంగారంతో తయారుచేసిన పట్టుచీరను కానుకగా సమర్పించారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ గత మూడేళ్లుగా సీతమ్మ తల్లికి కళ్యాణం రోజు పట్టుచీర తయారుచేసి సమర్పిస్తున్నారు. ఈసారి రూ.35 వేల విలువగల బంగారు పట్టుచీరను తయారుచేసి భద్రాచలంలో సమర్పించారు. చీరపై సీతారాముల విగ్రహాలను చిత్రీకరించినట్లు తెలిపారు.

News April 5, 2025

గద్వాల: అంబేడ్కర్ ఆలోచన పండుగను విజయవంతం చేద్దాం: నాయకులు

image

గద్వాల్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 12న నిర్వహించనున్న అంబేద్కర్ ఆలోచన పండుగ ర్యాలీ సభ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ, శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం, వారి విగ్రహం ఎదుట అంబేడ్కర్ ఆలోచన పండుగకు సంబంధించిన గోడపత్రికలను ప్రజాసంఘాల నాయకులు, బోధన సిబ్బంది, కార్యకర్తలు సంయుక్తంగా ఆవిష్కరించారు.

News April 5, 2025

SBI PO ఫలితాలు విడుదల

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. గత నెల 8, 16, 24, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, DOB, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

error: Content is protected !!