News February 3, 2025
HYDలో త్రిష ట్రైనింగ్.. ఇదీ ఫలితం!

గొంగడి త్రిష.. U-19 క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. తన ప్రతిభతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచారు. ఇంతలా పేరు తెచ్చుకున్న ఆమె మన తెలంగాణ బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. 2013లో భద్రాచలం నుంచి HYDకి వచ్చిన రామిరెడ్డి 7 ఏళ్ల త్రిషను సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్చారు. రోజుకు 8 గంటలు ప్రాక్టీస్ చేసిన త్రిష నేడు తన ప్రదర్శనతో HYDలో బెస్ట్ ట్రైనింగ్ ఉందని నిరూపించారు.
Similar News
News April 11, 2026
ప.గో: పెళ్లింట తీవ్ర విషాదం

పెదవేగిలోని వలసపల్లి సమీపంలో <<19612501>>గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలపూడి(M)ముక్కంపాడుకు<<>> చెందిన సచివాలయ ఉద్యోగి సుధీర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇతని భార్య గర్భిణీ. అంతేకాకుండా మరోవైపు మృతుని సోదరునికి ఈ నెల 25న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోవడంతో పెళ్లింట శోక సంద్రంలో మునిగిపోయారు.
News April 11, 2026
ఎల్లారెడ్డిపేట: సెక్యూరిటీ లేకే.. ఏటీఎం ఎత్తుకెళ్లారు!

ఎల్లారెడ్డిపేటలో ఎస్బీఐ ఏటీఎం మిషన్ చోరీకి భద్రతా లోపమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మండలంలోని ఐదు ఏటీఎంలలో కేవలం ఒక సిరిసిల్ల బ్యాంకుకు మాత్రమే సెక్యూరిటీ గార్డు ఉండటం గమనార్హం. జిల్లాలోనే ఇది మొట్టమొదటి వింత చోరీ కావడంతో ఎస్పీ తీవ్రంగా పరిగణించి, నిందితుల వేట కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భద్రతా నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 11, 2026
KMR: రేపు జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు

కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం 10 గంటలకు డీఎస్ఏ రెజ్లింగ్ హాల్‌లోని స్విమ్మింగ్ పూల్ వద్ద జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా రెజ్లింగ్ ఛైర్మన్ వినోద్ తెలిపారు. ఈ పోటీలకు 2009–2011 మధ్య జన్మించిన క్రీడాకారులు అర్హులని, పాల్గొనేవారు తమ ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.


