News August 10, 2024

HYDలో త్వరలో 5 ఎకరాల్లో ఫుట్‌బాల్ కోర్టులు!

image

గ్రేటర్ HYD నగరంలో ఫుట్‌బాల్ పై ఆసక్తి పెంచడంతో పాటు, క్రీడాకారులను తయారు చేసినందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రచిస్తోంది. అనువైన ప్రాంతాల కోసం అన్వేషిస్తోంది. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో జోన్ ప్రాంతంలో ఒక్కో ఫుట్ బాల్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 20, 2025

సందర్శకులతో కిక్కిరిసిన నాంపల్లి నుమాయిష్‌

image

నాంపల్లి ఎగ్జిబిషన్‌ ఆదివారం సందర్శకులతో కిక్కిరిసింది. ఒక్కరోజే 65 వేల మంది వచ్చినట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ వెల్లడించారు. వివిధ స్టాళ్ల వద్ద తమకు నచ్చినవి కొనుగోలు చేస్తూ పిల్లలతో సరదాగా గడిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఆసక్తి కనబరిచారు.

News January 20, 2025

కేజ్రీవాల్‌పై అంబర్‌పేట్ వాసి పోటీ..!

image

HYD అంబర్‌పేట్ వాసి దుగ్గిరాల నాగేశ్వరరావు న్యూఢిల్లీ 40వ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన పోటీ చేస్తున్నారు. ఈ మేరకు జాతీయ జనసేన పార్టీ తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలో విద్యాభ్యాసం చేసిన నాగేశ్వరరావు అంబర్‌పేట్‌లో ఉంటున్నారు. తన పార్టీ గుర్తు గ్రీన్ చిల్లి అని తెలిపారు. ఇటీవల ఆయన వయనాడ్‌లో ప్రియాంకా గాంధీపై పోటీ చేశారు.

News January 20, 2025

HYD స్విమ్మర్ సరికొత్త రికార్డు

image

HYD కాచిగూడకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీని విక్టోరియా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. డిగ్రీ చదువుతున్న తన కుమారుడు స్టీఫెన్ కుమార్(20)తో కలిసి ఆదివారం అరేబియా సముద్రంలోని మండ్వాజెట్ నుంచి ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి చరిత్ర సృష్టించారు. తల్లీకుమారుడు కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారి.