News October 7, 2024

HYDలో నమోదైన వర్షపాతం వివరాలు

image

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. మల్కాజిగిరిలో అత్యధికంగా 4.45 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మారేడ్‌పల్లిలో 2.85, సీతాఫల్‌మండిలో 2.43, కూకట్‌పల్లిలో 1.60, ఉప్పల్ 1.35 సెంటీమీటర్ల వర్షం పడింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News October 7, 2024

HYD: ఫ్యూచర్ సిటీ వైపు పరుగులు.. జర జాగ్రత్త..!

image

రాష్ట్ర ప్రభుత్వం RR జిల్లా మహేశ్వరం పరిధి కందుకూరు, ముచ్చర్ల, మీర్‌ఖాన్‌పేట్, బేగరికంచె ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు పరుగులు పెడుతున్నాయి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పేరుతో కొందరు కేటుగాళ్లు నకిలీ పత్రాలతో భూ అమ్మకాలకు పాల్పడుతున్నారు. జర జాగ్రత్త!

News October 7, 2024

HYD: ముసాయిదాపై అభిప్రాయ సేకరణ: మంత్రి

image

రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి HYDలో అన్ని జిల్లాల కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త ROR చట్టం, 2024 ముసాయిదాపై అధికారుల నుంచి మంత్రి అభిప్రాయాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

News October 7, 2024

HYD: బతుకమ్మ సంబరాల్లో ముస్లిం నాయకులు

image

HYD చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి శేరిలింగంపల్లిలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పలువురు ముస్లిం నాయకులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. TPCC మైనార్టీ సెల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. అన్ని మతాల పండుగలను గౌరవించడం భారత పౌరుడిగా మన బాధ్యత అని అన్నారు.