News March 28, 2025
HYDలో నీటి ఎద్దడికి ఈ ఫొటో నిదర్శనం

ఈ దృశ్యం HYD శివారు మేడ్చల్లోని మూడుచింతలపల్లిలో నీటి ఎద్దడికి నిదర్శనం. మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ రాకపోవడంతో అక్కడ నివసించే మహిళలు కాలినడకన చిన్నపిల్లలతో సహా బిందెలు, డబ్బాలతో దూరప్రాంతాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఏడాది నుంచి ఈ సమస్య ఇలాగే ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు తమ గోడు వినిపించదా మమ్మల్ని పట్టించుకోరా? అని మండిపడుతున్నారు.
Similar News
News December 13, 2025
నేడు కాణిపాకంలో నెల్లూరు కార్పొరేటర్ల ప్రమాణం.?

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఘట్టం <<18549066>>వైకుంఠపాళి<<>>ని తలపిస్తోంది. అవిశ్వాసాన్ని నెగ్గించాలని TDP, అడ్డుకోవాలని YCP పావులు కదుపుతున్నాయి. పలువురు కార్పొరేటర్లు ‘<<18540168>>జంపింగ్ జపాంగ్<<>>’లా మారారు. ఎలాగైనా తమ కార్పొరేటర్లను కాపాడుకోవాలని TDP వారిని తిరుపతి తరలించిందట. మరికాసేపట్లో వారిని కాణిపాకం తరలించి ‘మేము TDPలోనే కొనసాగుతాం’ అని ప్రమాణం చేయించనున్నారట.
News December 13, 2025
ఖమ్మం: క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిశీలించిన సీపీ

ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. రూరల్ మండలంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,059 కేసుల్లో 7,129 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<


