News March 28, 2025

HYDలో నీటి ఎద్దడికి ఈ ఫొటో నిదర్శనం

image

ఈ దృశ్యం HYD శివారు మేడ్చల్‌లోని మూడుచింతలపల్లిలో నీటి ఎద్దడికి నిదర్శనం. మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ రాకపోవడంతో అక్కడ నివసించే మహిళలు కాలినడకన చిన్నపిల్లలతో సహా బిందెలు, డబ్బాలతో దూరప్రాంతాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఏడాది నుంచి ఈ సమస్య ఇలాగే ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు తమ గోడు వినిపించదా మమ్మల్ని పట్టించుకోరా? అని మండిపడుతున్నారు.

Similar News

News April 3, 2025

ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే ఆపాలి: ప్రొ.హరగోపాల్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే నిలిపివేసి, గచ్చిబౌలి కంచ గచ్చిబౌలిలో అడవిని నాశనం చేయకూడదని ప్రొ.హరగోపాల్ సూచించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ అడవి ఎంతో సుసంపన్నమైన ప్రకృతి అని, చూస్తే కానీ అర్థం కాదన్నారు. ఈ అడవిలో ఎన్నో రకాల అరుదైన పక్షి జాతులు ఉన్నాయని, ఒకసారి ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి వందల ఏళ్లు పడుతుందని తెలిపారు.

News April 2, 2025

HCUకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పిలుపు

image

HCU విద్యార్థులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడాన్ని BJYM నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన విధానాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా BJYM ఆందోళనకు పిలుపునిచ్చింది. సీఎంకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నామని రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

News April 2, 2025

రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి: కిషన్ రెడ్డి

image

రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని మీరు హామీ ఇచ్చి ఇప్పుడు నెపాన్ని కేంద్రంపై ఎలా నెడుతారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేకపోతే, ఎలా హామీ ఇచ్చారన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేకే రేవంత్ ఈ డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలను వాడుకొని వదిలేయాలన్న ఆలోచనే ఉందని మండిపడ్డారు.

error: Content is protected !!