News March 28, 2025

HYDలో నీటి డిమాండ్.. కారణం ఇదే..!

image

HYDలో భారీగా మంచి నీటి డిమాండ్ ఏర్పడి లక్షలాది ట్యాంకర్లను బుకింగ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ప్రశ్నలు వర్షం కురిపించారు. అయితే HMWSSSB ఎండీ అశోక్ రెడ్డి దీనిపై కీలక విషయాలు వెల్లడించారు. నగరంలో తాగునీటికి ఇంత డిమాండ్ ఏర్పడడానికి కారణం, అవసరానికి మించి నీటిని వినియోగించడమే అని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

MDK: స్థానిక పోరుకు సిద్ధమా..?

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ పోరుకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు పూర్తి చేశారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేఫథ్యంలో పల్లెల్లో రాజకీయం వెడెక్కింది. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నచోట పోటీకి సిద్ధమవుతుండగా, రిజర్వేషన్లు అనుకూలం లేనిచోట అనుచరులను బరిలో నిలిపి స్థానికంగా పట్టు నిలుపుకోవాలని నాయకులు భావిస్తున్నారు. మెదక్‌లో 223 సర్పంచ్, 1,810 వార్డులను మహిళలకు కేటాయించారు.

News November 24, 2025

అన్నమయ్య: పక్కా ఇల్లు.. 6రోజులే గడువు

image

గ్రామీణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇస్తున్నాయి. స్థలం ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తారు. స్థలం లేనివాళ్లకు 3సెంట్లు కేటాయించి ఇల్లు మంజూరు చేస్తారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో 18వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వాళ్లు సైతం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఇల్లు మంజూరు చేస్తారు.

News November 24, 2025

భీమవరం: 3,000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.