News February 17, 2025
HYDలో నెహ్రూ జూ పార్క్ వద్ద అధిక కాలుష్యం..!

HYD నగరం పరిధిలో నెహ్రూ జూపార్క్ ప్రాంతం అత్యంత కాలుష్యమైన ప్రాంతమని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. 40 రోజుల సగటు వాయు నాణ్యత 150గా నమోదైందని పేర్కొంది. జనవరి 20వ తేదీన అత్యధికంగా 200 నమోదైందని వెల్లడించింది. అతి సూక్ష్మ ధూళి కణాలు అధిక మోతాదులో విడుదవుతున్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.
Similar News
News April 11, 2026
GDK: రేపే ‘పుణ్యక్షేత్రాల’ యాత్ర.. ఆర్టీసీ ప్రత్యేక బస్సు

గోదావరిఖని డిపో ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఏసీ రాజధాని బస్సులో దక్షిణ భారత పుణ్యక్షేత్రాల యాత్ర ప్రారంభం కానుంది. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, కంచి, జోగులాంబ తదితర క్షేత్రాలను సందర్శించవచ్చు. ఒక్కొక్కరికి రూ. 10,500 చార్జీగా నిర్ణయించారు. భోజనం, వసతి ఖర్చులు భక్తలవే. ఆసక్తి గల భక్తులు మరిన్ని వివరాలకు 7013504982, 7382847596 నంబర్లకు సంప్రదించవచ్చు.
News April 11, 2026
ఆదోని వద్ద ఘోర ప్రమాదం.. యువతి మృతి

ఆదోని–సిరుగుప్ప రహదారిలోని లక్ష్మమ్మ వేర్ హౌస్ వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి వస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక యువతి మరణించగా, మరో ఇద్దరు యువతులు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్వీ పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 11, 2026
వాట్సాప్‌లోనే రిజిస్ట్రేషన్ సర్వీసులు

TG: స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. 8096958096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. కావాల్సిన సర్వీసు ఎంచుకొని వివరాలు నమోదు చేసి, ఫాం నింపాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేసి సర్వీసులు పొందవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తర్వాత సర్టిఫైడ్ EC కాపీ నేరుగా వాట్సాప్‌లోనే అందుతుంది.
Share It


