News June 2, 2024

HYDలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!

image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న HYDలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్యాట్నీ క్రాస్ రోడ్ నుంచి స్వీకర్ ఉపకార్ వరకు.. పరేడ్ గ్రౌండ్ రోడ్డులో టివోలీ క్రాస్ రోడ్డు వరకు..అక్కడి నుంచి బ్రోక్ బ్యాండ్ క్రాస్ రోడ్డు వరకు.. CTOనుంచి YMCAక్రాస్ రోడ్డు, సెయింట్ జాన్ రోటరీ మార్గంలో వాహనాలను అనుమతించబోమన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు.

Similar News

News September 9, 2024

HYD: నగర వాసులకు ముఖ్య గమనిక

image

16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మ జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో నిర్వహించే ముఖ్య సమావేశాల కారణంగా మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అర్జీదారులంతా విషయాన్ని గమనించి బదులుగా బుధవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

News September 8, 2024

HYD ఇన్‌స్టాలో పరిచయం.. 20రోజులు ఓయోలో బంధించాడు

image

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతడి కోసం ఇక్కడకు వచ్చిన బాలికను నారాయణగూడలోని ఓయో రూమ్‌లో 20 రోజులు బంధించాడు. బాలిక తల్లిదండ్రలకు వాట్సాప్‌‌లో లొకేషన్ షేర్ చేయడంతో బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

News September 8, 2024

HYD: నిమజ్జనానికి కీలక సూచనలు జారీ

image

హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
* గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుంది.
* నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు.* పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి.