News March 21, 2025
HYDలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హజ్రత్ అలీ వర్ధంతి సందర్భంగా నేడు చార్మినార్ నుంచి మస్జిద్-ఇ-ఇమామియా వరకు జరిగే ఊరేగింపు కారణంగా మ. 2:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని HYD ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. నయాపూల్, చట్టాబజార్, పురాణిహవేలి, దారులషిఫా గ్రౌండ్స్, ఎస్జే రోటరీ, దబీర్‌పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రయాణికులు ట్రాఫిక్ అప్డేట్స్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలని సూచించారు.
Similar News
News April 1, 2025
కేసీఆర్‌తో వరంగల్ బీఆర్ఎస్ నేతల భేటీ

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వారంతా కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సభా నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. పార్టీ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేస్తామని వారంతా ముక్తకంఠంతో పార్టీ అధినేతకు హామీ ఇచ్చారు.
News April 1, 2025
HYD: కారులో జర్మనీ యువతితో అసభ్య ప్రవర్తన

మీర్‌పేటలో కలకలం రేగింది. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో జర్మనీకి చెందిన యువతి మందమల్లమ్మ వద్ద కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తి పహాడిషరీఫ్ ప్రాంతంలో ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. మీర్‌పేట PSలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులకు బదిలీచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 1, 2025
HYD ఊపిరి ఆగుతుందని స్లోగన్స్

HCUలో ప్రభుత్వ దమనకాండ అంటూ KBR పార్కు దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది. HCU అడవిని నరికితే.. హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది’ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు నినాదాలు చేశారు. ఈ నిరసనకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకృతి ప్రేమికులు, మద్దతు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.