News March 27, 2025
HYDలో నేడు డబుల్ ధమాకా

HYDలో IPL సంబరాలు నేడు అంబరాన్ని అంటనున్నాయి. వినోదానికి ఉర్రూతలూగించే సంగీతం జతకానుంది. నేడు ఉప్పల్ వేదికగా రాత్రి 7:30కు SRH VS LSG మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో భాగంగా స్టేడియంలో తమన్ మ్యూజికల్ నైట్ ఈవెంట్ ఉంది. ఇంకేముంది క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు. హైదరాబాద్ ఫ్యాన్స్ తగ్గేదే లే అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
ఖమ్మం: KUలో త్వరలోనే ఫేస్ రికగ్నిషన్ హాజరు..!

కాకతీయ యూనివర్సిటీలో టీచింగ్, నాన్టీచింగ్(రెగ్యులర్, కాంట్రాక్టు, టైంస్కేల్, ఔట్సోర్సింగ్) ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం అమలు చేయడానికి కేయూ సిద్ధమైంది. ఈనెల 6, 8వ తేదీల్లో ఉద్యోగులు తమ విభాగాల్లో అందుబాటులో ఉండాలని, ఫొటో క్యాప్చర్ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిపాలన భవనానికి హాజరవాల్సిందిగా రిజిస్ట్రార్ రామచంద్రం వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచించినట్లు సమాచారం.
News December 5, 2025
నల్గొండ: హంగు లేదు.. ఆర్భాటమూ లేదు!

గత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజున ప్రధాన పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థులు భారీ ర్యాలీ తీసి, డప్పుచప్పుళ్లతో జనసమీకరణ చేసి నామినేషన్ దాఖలు చేసేవారు. అదే సందడి పోలింగ్ ముగిసే వరకు కొనసాగించే
వారు. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులు హంగు, ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేయడం, గుట్టచప్పుడు కాకుండా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
News December 5, 2025
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

TG: వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని తెలిపారు.


