News April 2, 2024
HYDలో పడిపోతోన్న నీటి మట్టం..!

HYDలో భూగర్భ జలాల మట్టం రోజురోజుకు పడిపోతోంది. 2023 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు మాసబ్ ట్యాంక్ 5.08 మీటర్లు, కుల్సుంపుర 1.87, బహదూర్‌పుర 0.24, చార్మినార్ 2.34, నాంపల్లి 2.53, ఎర్రగడ్డ 0.25, ఖైరతాబాద్ 0.93, మారేడ్‌పల్లి 0.69, తిరుమలగిరి 1.29 మీటర్ల నీటి మట్టం తగ్గినట్లుగా భూగర్భ జల శాఖ అధికారులు పేర్కొన్నారు. నీటిని వృథా చేయొద్దని సూచించారు. ఇప్పటికే గ్రేటర్ HYDలో నీటి ట్యాంకర్ల వాడకం పెరిగింది.
Similar News
News October 15, 2025
జూబ్లీహిల్స్‌లో KCR రోడ్ షోకు PLAN

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థి మాగంటి సునీత తరఫున ఆ పార్టీ ఈనెల 19న భారీ రోడ్‌షోకు ఏర్పాట్లు చేసింది. ఇందులో BRS చీఫ్ KCR పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రతిష్ఠాత్మక పోరులో గెలిపే లక్ష్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే జూబ్లీ బరిలో పావులు కదుపుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా KCR తప్పకుండా జూబ్లీహిల్స్‌లో ఎంట్రీ ఇస్తారని కార్యకర్తలు ఆశాగా చూస్తున్నారు.
News October 15, 2025
జూబ్లీహిల్స్: సాదాసీదాగా సునీత నామినేషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో KTRతో కలిసి ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
News October 15, 2025
ఎన్నికల చిత్రం: అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

ఎన్నికల వేళ పార్టీలు మారడం సహజమే. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నాయకులు కండువాలు మార్చేస్తున్నారు. మస్కటి డైరీ డైరెక్టర్ అలీ మస్కటి గత అసెంబ్లీ ఎన్నికల ముందు TDP నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి BRSలో చేరారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత నాని ఆ పార్టీని వదిలి నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.