News December 26, 2024
HYDలో పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బుధవారం ఆకాశంలో మబ్బులు కమ్మేసి మేఘావృతమైంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గరిష్ఠంగా 28, కనిష్ఠంగా 19.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు పగటిపూట చలిలో మంచుతో పాటు చిరుజల్లులు కురిశాయి. ఒకేసారి వాతావరణ మార్పుతో కొంత ఆహ్లాదకరంగా కనిపించినా.. ప్రజలు చలితో గజగజ వణికిపోయారు.
Similar News
News November 27, 2025
BREAKING: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

సున్నంచెరువు కూల్చివేతల వ్యవహారంపై హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. FTL నిర్ధారణ లేకుండా హద్దులు నిర్ణయించడం, గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను పట్టించుకోకపోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. సియేట్ మారుతీహిల్స్ కాలనీలో ఇకపై ఫెన్సింగ్, కూల్చివేత చర్యలకు దిగొద్దని హైకోర్టు హెచ్చరించింది.
News November 27, 2025
గాంధీ భవన్ వైపు రంగారెడ్డి నేతల చూపు

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. అయితే రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇంతవరకు అధ్యక్షుడిని నియమించలేదు. ఎందుకు అధ్యక్షా? అని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రశ్నిస్తున్నారు. డీసీసీ చీఫ్ పోస్టు కోసం రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానికేతరుడిని నియమిస్తున్నారని తెలియడంతో పలువురు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఎంపిక వాయిదా పడిందని సమాచారం.
News November 27, 2025
HYD: చేతిరాత బాగుంటుందా? మరెందుకు ఆలస్యం

మీ చేతిరాత అందంగా ఉంటుందా? నలుగురూ మీ రాతను మెచ్చుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. చేతిరాత పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైటింగ్ స్కిల్స్పై అవగాహన, ఆసక్తి కల్పించేందుకు చేతిరాత పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు స్టీఫెన్ తెలిపారు. పాఠశాలస్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు www.indianolympiads.comలో నమోదు చేసుకోవాలి.


