News August 8, 2024

HYDలో పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం

image

AP క్యాబ్ డ్రైవర్లను HYDలో తిరగనివ్వాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై తెలంగాణ క్యాబ్ అసోసియేషన్స్ నాయకులు మండిపడ్డారు. మోటర్ వాహన చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాల వాహనాలు అనుమతి లేకుండా ఇక్కడ వ్యాపారాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించడం నేరమని క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ పేర్కొన్నారు. కాగా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన క్యాబ్ డ్రైవర్ల వాగ్వాదం చిలికి చిలికి, గాలి వానలా మారింది.

Similar News

News September 17, 2024

బాలాపూర్ లడ్డూ.. 30 ఏళ్లలో ఆమె ఒక్కరే..!

image

HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రతీ సంవత్సరం ఎంతో ఉత్కంఠ నడుమ కొనసాగుతుంది. అయితే ప్రతిసారి ఇందులో పురుషులే పాల్గొంటూ ఉంటారు. కానీ 2009లో మాత్రం సరిత అనే మహిళ వేలంలో పాల్గొని రూ.5,10,000కు లడ్డూ కైవసం చేసుకుని సత్తా చాటారు. 1994 నుంచి 2024 వరకు 30 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ కొన్న ఒకే ఒక్క మహిళగా సరిత నిలిచారు. ఈసారి రూ.30,01,000కు కొలన్ శంకర్ రెడ్డి లడ్డూ దక్కించుకున్న విషయం తెలిసిందే.

News September 17, 2024

బాలాపూర్ లడ్డూ స్పెషల్.. ఒక్కరే ఐదు సార్లు..!

image

HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. కాగా 1994లో ఈ వేలం ప్రారంభమవగా తొలిసారి కొలన్ మోహన్ రెడ్డి రూ.450కి లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆయనే 1995లో రూ.4,500, 1998లో రూ.51,000, 2004లో రూ.2,01,000, 2008లో రూ.5,07,000 వేలం పాడి ఐదు సార్లు లడ్డూ కైవసం చేసుకున్నారు. గత 30 ఏళ్లలో ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. SHARE IT

News September 17, 2024

దద్దరిల్లుతున్న హైదరాబాద్

image

వినాయక నిమజ్జనాలు, భారీ జులూస్‌లతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. మరికాసేపట్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, LED లైట్ల నడుమ యువత కేరింతలు కొడుతున్నారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై’ నినాదంతో HYD హోరెత్తింది.