News August 2, 2024

HYDలో పార్కింగ్ ఫీజు‌లపై ఆమ్రపాలి కాట సీరియస్

image

నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై తనిఖీలు చేయుటకు ప్రత్యేకంగా టీమ్స్ వేశారు. అక్రమాలు చేసిన ఆయా మాల్స్‌కు, మల్టీప్లెక్స్‌లకు నోటీసులు జారీ చేశారు.

Similar News

News February 23, 2026

గ్రేటర్‌లో కొత్త వెలుగుల జిలుగులు

image

మూడు ముక్కలైన గ్రేటర్ పాలనలో ఇప్పుడు కొత్త కాంతులు నిండనున్నాయి. EESL తప్పుకోవడంతో వీధి దీపాల నిర్వహణ భారమైనా ప్రభుత్వం పట్టు వదలకుండా CYB, మల్కాజిగిరి, GHMC పరిధిలో ఒకే తరహా వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక జీవో విడుదల కానుంది. ఇకపై నగరం మొత్తం ఒకే రకమైన ప్రకటనల పాలసీ అమల్లోకి రానుంది. డిజిటల్ వెలుగులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సర్కారు అడుగులు వేస్తోంది.

News February 23, 2026

మురికి కూపంలో జవహర్‌నగర్.. డంపింగ్ యార్డు వేట!

image

గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం చివరకు జవహర్‌నగర్ పాలిట శాపంగా మారింది. సిటీ నుంచి రోజూ దాదాపు 8000 మెట్రిక్ టన్నుల చెత్త అక్కడ చేరుతుండగా.. కొత్త ప్రాంతాల నుంచి వస్తున్న 1500 టన్నుల అదనపు భారం ఆ ఊరిని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఈ నరకం నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. శివారు ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డుల కోసం వేట మొదలుపెట్టింది.

News February 23, 2026

HYD: పోలీసులకు దొరికితే హెల్మెట్ ఫ్రీ.. Conditions Apply!

image

హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREE‌గా హెల్మెట్‌ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి. చలాన్ల కన్నా ప్రాణ రక్షణే ముఖ్యం అని పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.