News August 22, 2024
HYDలో పీల్చే గాలి చంపేస్తోంది!

HYDలో కాలుష్యం పెరుగుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ‘స్టేటస్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 నుంచి 2019 వరకు నగరంలో పీఎం 2.5 వంటి సూక్ష్మదూళి కణాల ఉద్గారాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. 2000 నాటికి కాలుష్యం బారిన పడి 2,810 మంది, 2019 నాటికి 6,460 మంది మరణించారు.
Similar News
News July 11, 2025
JNTUHలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

జేఎన్టీయూ హైదరాబాద్ & జర్మనీలో టాప్-3లో ఉన్న Reutlingen పబ్లిక్ యునివర్సిటీ కలసి సంయుక్తంగా అందిస్తున్న 3 ఇంటర్నేషనల్ డిగ్రీ కోర్సులలో అడ్మిషన్లు మొదలయ్యాయి. జేఈఈ, టీజీఎంసెట్, గేట్ & టీజీపీజీసెట్ రాసిన విద్యార్థులు www.jntuh.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. కోర్సులో ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్ ఉంటుంది. వారానికి 20 గంటల పనికి పర్మిషన్, 18 నెలల వర్క్ పర్మిట్ కూడా లభిస్తుంది.
News July 11, 2025
HYD: పీ.వీ.రమణ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖ ప్రతి సంవత్సరం ‘పీ.వీ.రమణ రంగస్థల స్మారక పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. 2024-25 సంవత్సరానికిగాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్కులర్ విడుదల చేసింది. ఆగస్టు 1లోగా రంగస్థలంలో కృషి చేసిన నటులు, సాంకేతిక నిపుణులు అర్హులైన వారు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో తమ బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.
News July 11, 2025
HYD: చైల్డ్ పోర్న్ వీడియోలపై 22కేసులు నమోదు

HYD సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ కేసుల్లో మొత్తం 25 మందిని అరెస్టు చేసి రూ.3.67కోట్లను బాధితులకు రిఫండ్ చేశారు. పట్టుబడిన నేరగాళ్లపై దేశవ్యాప్తంగా 453 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని వాటి సంఖ్య 66గా ఉంది. ఈ క్రమంలో చైల్డ్ పోర్న్ వీడియోల కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు.