News November 30, 2024
HYDలో పెరిగిన చలి.. ఒకరి మృతి
HYD, ఉమ్మడి RR జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. నగర శివారు ఏరియాలు వణికిపోతున్నాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో అత్యల్పంగా 10 డిగ్రీలు, గ్రేటర్‌లోని RCపురంలో 11.3 ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం గమనార్హం. జనవరి-24 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరో ఆందోళనకర విషయం ఏంటంటే.. చేవెళ్ల మం. ఖానాపూర్‌కి చెందిన మల్లారెడ్డి(40) లంగర్‌హౌస్‌లో చలి తీవ్రత తట్టుకోలేక మృతి చెందాడు. చలిలో బీ కేర్ ఫుల్.
SHARE IT
Similar News
News December 4, 2024
HYDలో ‘పుష్ప 2’ విడుదలయ్యే థియేటర్ల LIST!
సింగిల్ స్క్రీన్స్: సంధ్య 70, సంధ్య 35, సుదర్శన్ 35, దేవి 70-RTC X రోడ్స్, తారకరామ 70-కాచిగూడ, శాంతి 70-నారాయణగూడ, అంజలి 70, ప్రశాంత్ 70-సికింద్రాబాద్, శ్రీరమణ-అంబర్‌పేట, ఆరాధన AC-తార్నాక, గోకుల్ 70-ఎర్రగడ్డ, విజేత 70-బోరబండ, VLS శ్రీదేవి-చిలకలగూడ.
మల్టీప్లెక్స్: AMB, ప్రసాద్, PVR, Cinepolis, INOX, ASIAN, AAA, సినీప్లానెట్‌తో పాటు తదితర మల్టీ స్క్రీన్‌లలో సినిమా విడుదల చేస్తున్నారు.
SHARE IT
News December 4, 2024
HYD: రేపు డెక్కన్ ఎరీనాలో హోరాహోరీ మ్యాచ్
అజీజ్‌నగర్‌లో ఐ – లీగ్ (ఫుట్ బాల్) పోటీలు జరగనున్నాయి. డెక్కన్ ఎరీనాలో రేపు (గురువారం) రాజస్థాన్ యునైటెడ్ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తలపడనుంది. హైదరాబాద్ తరఫున శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తలపడనున్న నేపథ్యంలో మ్యాచ్‌కి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
News December 4, 2024
అమీర్‌పేట: ఆధార్ సేవల కోసం తప్పని తిప్పలు..!
TG, AP, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆధార్ సేవల కోసం అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ ఆధార్ రీజినల్ సెంటర్ వద్దకు వచ్చిన వారికి తిప్పలు తప్పడం లేదు. ప్రతిరోజు కేవలం 150 టోకెన్లు మాత్రమే ఇస్తుండడంతో, ఉదయం 6 గంటలకు వచ్చి క్యూ కడుతున్నారు. అసలే చలికాలం కావడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. మంగళవారం ఓ వ్యక్తికి మూర్చ రాగా.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.