News November 30, 2024

HYDలో పెరిగిన చలి.. ఒకరి మృతి

image

HYD, ఉమ్మడి RR జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. నగర శివారు ఏరియాలు వణికిపోతున్నాయి. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో అత్యల్పంగా 10 డిగ్రీలు, గ్రేటర్‌లోని RCపురంలో 11.3 ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం గమనార్హం. జనవరి-24 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరో ఆందోళనకర విషయం ఏంటంటే.. చేవెళ్ల మం. ఖానాపూర్‌కి చెందిన మల్లారెడ్డి(40) లంగర్‌హౌస్‌లో చలి తీవ్రత తట్టుకోలేక మృతి చెందాడు. చలిలో బీ కేర్ ఫుల్.
SHARE IT

Similar News

News December 13, 2024

HYD: జూ పార్క్ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం

image

సచివాలయంలో జూపార్క్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి కొండా సురేఖ నిర్వహించారు. అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ (హెచ్ఎఎఫ్ఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలుసింగ్ మేరు, సీసీఎఫ్లు ప్రియాంక వర్గీస్, భీమా నాయక్, రామలింగం, డైరక్టర్ జూ పార్క్స్ సునీల్ ఎస్, హేరామత్, అధికారులు పాల్గొన్నారు.

News December 13, 2024

HYD: రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు: SHO

image

కొట్టుకుంటే ఇద్దరిలో ఒక్కరు మాత్రమే గెలుస్తారు. కానీ రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని నానుడి. వివిధ కేసుల్లో కక్షిదారులుగా ఉన్నవారు రేపు జరిగే నేషనల్ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన కేసులను రాజీ చేసుకోగలరని హయత్‌నగర్ SHO నాగరాజు గౌడ్ సూచించారు. నేషనల్ లోక్ అదాలత్‌‌లో కేసులు రాజీ చేసుకోవడానికి ఎలాంటి ఖర్చు ఉండదన్నారు.

News December 13, 2024

HYD: అగ్నివీర్ల ట్రైనింగ్‌పై ప్రశంసలు

image

సికింద్రాబాద్ EME కేంద్రాన్ని సీనియర్ కల్నల్ కమాండెంట్ సిదాన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్‌లను పరిశీలించారు. అనంతరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, బేసిక్ స్టాండర్డ్స్ మిలిటరీ ట్రైనింగ్, అగ్ని వీర్లకు అందిస్తున్న ట్రైనింగ్ విధానాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో వివిధ స్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.