News November 25, 2024
HYDలో పెరిగిన చలి.. జాగ్రత్త!❄
HYD, ఉమ్మడి RR జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. గత 3 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలిగాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త!
SHARE IT
Similar News
News November 25, 2024
HYD: చేపల వంటకాల గూరించి అడిగిన మంత్రి
HYD ట్యాంక్బండ్ ఐమ్యాక్స్ పక్కన ఉన్న గ్రౌండ్లో ప్రపంచ మత్స్యకార ఉత్సవ ముగింపు ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించిన మంత్రి, చేపల వంటకాల గురించి అడిగి తెలుసుకున్నారు. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, మత్స్యకారుల సేవలు వెలకట్టలేనివని అభినందించారు.
News November 25, 2024
HYD: అక్రమ కనెక్షన్లపై ఫిర్యాదు చేయండి: MD
HYDలో జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైపులైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఈ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలను కోరారు.
News November 25, 2024
HYD: నేడే రవీంద్రభారతిలో బీసీల రణభేరి: ఆర్.కృష్ణయ్య
BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ నేడు రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీల నాయకులను ఈ సభకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, అసెంబ్లీలో 50% రిజర్వేషన్ల అమలు, కేంద్ర జనగణనలో కులగణన వంటివి తమ డిమాండ్లలో ఉన్నాయని తెలిపారు. బీసీలందరం ఏకమవుదాం అన్నారు.