News November 25, 2024

HYDలో పెరిగిన చలి.. జాగ్రత్త!❄

image

HYD, ఉమ్మడి RR జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. గత 3 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలిగాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున‌ వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు‌ ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త!
SHARE IT

Similar News

News December 7, 2024

ఖైరతాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ.. కేంద్రమంత్రికి ఆహ్వానం

image

రాజ్‌భవన్ దిల్ కుశా గెస్ట్‌హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకూ రావాలన్నారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పొన్నం తెలిపారు.

News December 7, 2024

సోనియాగాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తాం: మహేశ్ కుమార్ గౌడ్

image

తెలంగాణ ప్రదాత ప్రియతమ నాయకురాలు సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 10 ఏళ్లళ్లో BRS ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే చేసిచూపించిందన్నారు. ఇప్పటివరకు 55వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

News December 7, 2024

HYD ఇన్‌ఛార్జ్ మంత్రి ఏడాది పాలన.. మీ కామెంట్?

image

హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి రవాణా, బీసీ సంక్షేమ శాఖలు కేటాయించడంతో పాటు HYD ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌ఛార్జ్ మంత్రిగా HYDలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీబస్సు పథకం ప్రారంభం, పెండింగ్ ఫ్లైఓవర్లు, నాలాల నిర్మాణం చేపట్టారన్నారు. మీ కామెంట్?