News November 26, 2024
HYDలో పెరిగిన చికెన్ ధరలు

హైదరాబాద్లో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్లెస్ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.
Similar News
News November 13, 2025
HYD: సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీల వైపు మళ్లింది?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా.. మరికొన్ని BRS వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కొందరిని భయపెడుతుంటే మరికొందరిని సంతోషంలో ముంచుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో అనుకూలంగా వచ్చినవారు గెలుపు ఖాయమనే ధీమాతో కార్యకర్తలతో మాట్లాడుతూ జోష్ ప్రదర్శిస్తుండగా.. సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీ వైపు మళ్లిందనేది రేపు తేలనుంది.
News November 13, 2025
OU: బీఈ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈ (సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) కోర్సుల సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
News November 13, 2025
HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


