News June 26, 2024
HYDలో పెరిగిన బస్‌పాస్ కౌంటర్లు.. ఆదివారం సెలవు!

నగరంలో నూతనంగా 2 బస్‌పాస్ కౌంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ED వెంకటేశ్వర్లు తెలిపారు. JNTU, లక్డీకాపూల్ బస్‌స్టాప్‌లో ఈ కౌంటర్లు ఉన్నాయి. 6:30AM నుంచి 8:15PM వరకు పనిచేస్తాయి. కొత్తగా గ్రీన్ మెట్రో లగ్జరీ మంత్లీ బస్‌పాస్ ఇస్తున్నారు. రేతిఫైల్, CBS, కాచిగూడ తదితర చోట్ల ఇప్పటికే కౌంటర్లు సేవలు అందిస్తున్నాయి. ఆదివారం సెలవు ఉంటుంది. SHARE IT
Similar News
News February 15, 2025
HYDలో పెరిగిన 100 వాటర్ ట్యాంకర్లు

గ్రేటర్ HYD మహానగర వ్యాప్తంగా వాటర్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా 100 ట్యాంకర్లను కొత్తగా జలమండలి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీంతో ట్యాంకర్ల సంఖ్య 949కి చేరింది. ప్రస్తుతం 78 ఫీలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరో 126 ఫీలింగ్ పాయింట్లు ఉన్నాయి. తాజాగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్ పెరిగినట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News February 14, 2025
HYD: కుంభమేళా టూర్.. యువకుడి మృతి (PHOTO)

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు బయలుదేరిన రంగారెడ్డి జిల్లా వాసులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌కు చెందిన వనం సంపత్ రాణా, వనం శ్రీనివాస్, చంద్రశేఖర్, రమేశ్, సాయి కారులో బయల్దేరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ శివారులో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో <<15456821>>సంపత్ రాణా<<>> అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. మృతుడి ఫైల్ ఫొటో పైన చూడొచ్చు.
News February 14, 2025
గచ్చిబౌలిలో ఏసీబీకి పట్టుబడ్డ ఏడీఈ

గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ACB అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ కుమార్ పట్టుబడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకు రూ.75వేలు డిమాండ్ చేశారు. వినియోగదారుల నుంచి ఇప్పటికే రూ.25 వేలు తీసుకున్నారు. కాగా, ఈరోజు మరో రూ.50 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ACB అధికారులు పట్టుకున్నారు.