News February 25, 2025
HYDలో పెరిగిన హలీం ధరలు

ఏడాదికోసారి నోరూరించే హలీం ధరలు అమాంతం పెరిగాయి. HYDలో పలుచోట్ల రంజాన్ ప్రారంభానికి ముందే హలీం దుకాణాలు వెలిశాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ వినియోగం పూర్తిగా తగ్గి, మటన్ ధరలు పెరగడంతో రేట్లు పెంచేశారు. గతేడాది ప్రముఖ హలీం సెంటర్లలో ప్లేట్ గరిష్ఠంగా రూ.280 ఉండేది. కాగా.. ఈ ఏడాది ఆయా సెంటర్లలో రూ.300-350 వరకు అమ్ముతున్నారు. ఇంతకీ HYDలో ది బెస్ట్ హలీం ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి.
Similar News
News November 20, 2025
HYD: గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా

నగరంలోని వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ వందన తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతలకు సంబంధించి సర్టిఫికెట్లతోపాటు ఆధార్ కార్డు, రెజ్యూమ్‌తో మల్లేపల్లిలోని (విజయనగర్ కాలనీ) ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో హాజరుకావచ్చని వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు 83284 28933 నంబరుకు కాల్ చేసి పొందవచ్చని పేర్కొన్నారు.
News November 20, 2025
గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు.
News November 20, 2025
ఎమ్మెల్యేల ఫిరాయింపు.. MLA గాంధీ న్యాయవాదుల విచారణ

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారనే పార్టీ ఫిరాయింపు విచారణకు సంబంధించి ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నేడు అసెంబ్లీ కార్యాలయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లు తమ వాదనలు వినిపిస్తారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఆరుగురి విచారణ ముగిసింది.


