News February 15, 2025

HYDలో పెరిగిన 100 వాటర్ ట్యాంకర్లు

image

గ్రేటర్ HYD మహానగర వ్యాప్తంగా వాటర్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా 100 ట్యాంకర్లను కొత్తగా జలమండలి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీంతో ట్యాంకర్ల సంఖ్య 949కి చేరింది. ప్రస్తుతం 78 ఫీలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరో 126 ఫీలింగ్ పాయింట్లు ఉన్నాయి. తాజాగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్ పెరిగినట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Similar News

News December 20, 2025

బొల్లారంలో పూలు గుసగుసలాడేనని.. సైగ చేసేనని

image

అందమైన పూలు.. అలరించే రంగులు.. మనలను కనువిందు చేయనున్నాయి. కొత్త ఏడాదిలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇందుకు వేదిక కానుంది. JAN 3 నుంచి 9 రోజుల పాటు (11 వరకు) ఉ. 10 నుంచి రాత్రి 8 వరకు ఉద్యాన్ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకగా సాగుతున్నాయి. ప్రవేశం ఉచితమని.. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశం వినియోగించుకోవాలని రాష్ట్రపతి నిలయం ఆఫీసర్ రజినీ ప్రియ తెలిపారు.

News December 20, 2025

గండిపేట: నిఘా నేత్రాలకు పక్షవాతం!

image

₹కోట్లు కుమ్మరించి నిర్మించిన గండిపేట ల్యాండ్‌స్కేప్ పార్కులో భద్రత గాలిలో దీపమైంది! అక్కడి నిఘా నేత్రాల పనిచేయక అక్రమార్కుల ధాటికి చెరువు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ​ఎట్టకేలకు నిద్రలేచిన HMDA, కెమెరాల మరమ్మతులు, ఏడాది నిర్వహణ O&Mకు ₹14,62,079తో టెండర్లు పిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన, కాలుష్యం ముదిరిన తర్వాత ఇప్పుడు మరమ్మతులకు పూనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News December 20, 2025

మహానగరం ఫుల్ పిక్చర్ రేపే విడుదల?

image

మున్సిపాలిటీల విలీనం తర్వాత పునర్విభజనకు సంబంధించి మహానగర వ్యాప్తంగా 5,905 అభ్యంతరాలతో పాటు సలహాలు కూడా వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన గ్రేటర్ అధికారులు తుది నివేదికను రూపొందించారు. ఇందుకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ రేపు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్కారు పెద్దలు, అధికారులు  ఊపిరి పీల్చుకున్నారు.