News April 8, 2025

HYDలో పొల్యూషన్.. అదే మన టార్గెట్!

image

HYD గాలిలో ధూళికణాల స్థాయి తగ్గింపే తమ లక్ష్యమని GHMC కమిషనర్ ఇలంబర్తి అన్నారు. పీఎం-10 స్థాయిని ఘనపు మీటరు గాలిలో 110 మైక్రోగ్రాముల నుంచి 81కి తగ్గించామని, అయితే దీన్ని 60 కంటే తక్కువకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. అప్పుడే ప్రజలకు నాణ్యమైన గాలి అందుతుందన్నారు. ఇందులో ప్రతీ పౌరుడు భాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు.

Similar News

News January 5, 2026

గార్డెన్‌లో మొక్కలకు చీడలు తగ్గాలంటే..

image

చలికాలంలో సరైన ఎండ లేకపోవడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలకు చీడలు ఎక్కువగా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే నాలుగు చెంచాల వంటసోడా, ఎక్కువ గాఢతలేని సోప్ పౌడర్ ఓ చెంచా తీసుకుని అయిదులీటర్ల నీటిలో వేసి కరిగించాలి. ఈ మిశ్రమాన్ని మొక్కలపై చల్లితే తిరిగి ఆరోగ్యంగా ఎదుగుతుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్‌ను నాలుగు లీటర్ల నీటిలో కలిపి చల్లితే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.

News January 5, 2026

ఆధారాల్లేవ్.. ఆ డివైజ్‌ కొనొద్దు: AIIMS డాక్టర్

image

జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ ధరించిన బ్రెయిన్ మ్యాపింగ్ డివైజ్‌ వల్ల ఎలాంటి యూజ్ ఉండదని AIIMS వైద్యుడు దత్తా అభిప్రాయపడ్డారు. బిలియనీర్లు డబ్బు వృథా చేసే ఇలాంటి ఖరీదైన బొమ్మలను కొనొద్దని సూచించారు. ఇది హార్ట్ ఎటాక్స్‌ను ముందే గుర్తిస్తుందని శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కేవలం ‘cfPWV’ మార్కర్ ద్వారానే గుండె సంబంధిత మరణాలను శాస్త్రీయంగా అంచనా వేయగలమని స్పష్టం చేశారు.

News January 5, 2026

పొద్దు తిరుగుడులో బోరాన్ లోపం – నివారణ

image

పొద్దుతిరుగుడు పంటకు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలను అందించాలి. పంట పూత దశలో బోరాన్ చాలా ముఖ్యం. ఇది లోపిస్తే మొక్కల లేత మరియు మధ్య ఆకులలో చివర్లు గుండ్రంగా మారి వంకర్లు తిరుగుతాయి. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. అందుకే ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.