News March 14, 2025
HYDలో ప్రప్రథమ శారీ డ్రాపింగ్ ఈవెంట్.. @మాంగళ్య షాపింగ్ మాల్

భారతీయ సంస్కృతికి చిహ్నం చీర కట్టు.. HYDలో ప్రప్రథమంగా మాంగళ్య షాపింగ్ మాల్ వారు శారీ డ్రాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. వనస్థలిపురంలోని షాపింగ్ మాల్‌లో చెన్నైకి చెందిన ప్రముఖ శారీ డ్రాపర్ కవిత చీర కట్టు ఎలా ఉండాలనే అంశాలను వివరించారు. ఆసక్తిగా గమనించిన ఫ్యాషన్ డిజైనర్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు యాజమాన్యాన్ని అభినందించారు. ఛైర్మన్ కాసం నమశ్శివాయ, డైరెక్టర్లు పాల్గొన్నారు.
Similar News
News October 18, 2025
HYD: సంపులో పడి చిన్నారి మృతి.. జర జాగ్రత్త..!

HYD నానక్ రాంగూడలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీఎన్జఓ కాలనీలో ఉండే పరమేశ్వర్, సంధ్యారాణి దంపతులకు కుమారుడు నిఖిల్ తేజ(4) ఉన్నాడు. ఈ క్రమంలో అంగన్‌వాడికి వెళ్లిన నిఖిల్ పక్కనే ఉన్న సంపులో ఆడుతూ పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతిచెందాడు. కొద్దిసేపు తర్వాత తల్లిదండ్రులు వెతకడంతో సంపులో మృతదేహం లభించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
News October 18, 2025
HYD: ‘పిల్లలు ఎలా పుడతారో తెలుసా’ అనడంతో విచారించిన టీచర్

సైదాబాద్ PS పరిధిలో <<18037331>>ముగ్గురు బాలికలపై<<>> ఓ యువకుడు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. స్థానికుల కథనం మేరకు.. లైంగిక దాడి అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తానని యువకుడు వారిని బెదిరించాడు. సెలవుల తర్వాత పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. తమ తోటి వారితో ‘పిల్లలు ఎలా పుడతారో తెలుసా’ అంటూ వారు మాట్లాడుతుంటే క్లాస్ టీచర్ విని విచారించింది. దీంతో లైంగిక దాడి విషయం వారు చెప్పగా టీచర్, పేరెంట్స్ PSలో ఫిర్యాదు చేశారు.
News October 18, 2025
HYD: అద్దె వాహనాలు, వసతి గడువు మరో ఏడాది పొడిగింపు

జిల్లా పంచాయతీ అధికారి (DPO), డివిజన్ లెవల్ పంచాయతీ ఆఫీసర్ల(DLPO) అద్దె వాహనాల వసతి మరో సంవత్సరం పాటు పొడిగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అద్దె కార్ల ఫైల్‌కు ఆమోదం తెలిపారు. మొత్తం 31 మంది డీపీఓలు, 68 మంది డీఎల్పీఓలకు వాహనాలను కొనసాగించనున్నారు. రెంట్ల కోసం రూ.3.96 కోట్లు మంజూరు చేసిన ఫైల్‌పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు.