News February 16, 2025

HYDలో ప్రేమికుల రోజు LOVER సూసైడ్

image

హైదరాబాద్‌ పాతబస్తీలో జరిగిన ఓ విషాద గాథ ఆలస్యంగా వెలుగుచూసింది. సంతోష్‌నగర్‌ పోలీసుల వివరాలు.. PSపరిధిలో ఉండే మహ్మద్ ఇమ్రాన్‌, చాంద్రాయణగుట్టకు చెందిన యువతి ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తండ్రి ఇమ్రాన్‌పై కోపంతో తన కూతురిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయించాడు. ఈ మనస్తాపంతో‌ ప్రియుడు ఉరేసుకున్నాడు. వాలంటైన్‌డే రోజు‌ ఇలా జరగడం స్థానికంగా విషాదం నింపింది.

Similar News

News April 17, 2026

HYD: ‘బ్యాక్‌డోర్’ ఆశ చూపి రూ.5 కోట్లు లూటీ

image

జాబ్ గ్యారంటీ అంటూ ‘బ్యాక్‌డోర్’ ఆశ చూపి నిరుద్యోగుల జేబులకు భారీ కన్నం వేశారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి కేంద్రంగా సాగిన ఈ ‘మాల్టా’ దందాలో 100మంది అమాయకులు రూ.5కోట్లు పోగొట్టుకున్నారు. MSME ముసుగులో నమ్మించి, ఫేక్ డొమైన్లతో నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించి ఒక్కొక్కరి నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేశారు. వీరి గుట్టును CID రట్టు చేయగా ఏడుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

HYD అమీర్‌పేట్‌లో వెలుగులోకి భారీ స్కాం

image

HYD అమీర్‌పేట్ కేంద్రంగా నడిచిన ఓ ప్రముఖ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మోసం బయటపడింది. ‘గ్యారెంటీడ్ ప్లేస్‌మెంట్’ పేరిట 500మంది నిరుద్యోగుల నుంచి తలో రూ.2లక్షల వరకు వసూలు చేసింది. మొత్తం రూ.10కోట్లకుపైగా కాజేసినట్లు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సిస్ వింగ్ గుర్తించింది. బాధితులకు నకిలీ ప్రాజెక్ట్‌లను ఇచ్చి, వారు ట్రైనింగ్‌లో విఫలమయ్యారనే సాకుతో డబ్బులు ఎగ్గొట్టారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేశారు.