News January 25, 2025

HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అని చెప్పి ఫేక్ వాచ్‌లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో ఈ ముఠా అమ్మకాలు జరపగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6,037 వాచ్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News December 10, 2025

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పౌర సరఫరా సంస్థ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. ధాన్యం అధికంగా కొనుగోలు చేసిన రైతు సేవా కేంద్రం సహాయకునికి, పౌరసరఫరాల ఉపతహశీల్దార్, తహశీల్దార్లకు అవార్డులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్తామన్నారు.

News December 10, 2025

బుమ్రా అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా

image

టీమ్ ఇండియా దిగ్గజ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు నమోదు చేశారు. SAతో జరిగిన తొలి టీ20లో బ్రెవిస్‌ని ఔట్ చేసి 100 వికెట్స్ క్లబ్‌లో చేరారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ తర్వాత ఈ ఘనత సాధించింది బుమ్రానే కావడం విశేషం. అలాగే అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పారు. బుమ్రా కంటే ముందు లసిత్ మలింగ, టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, షాహీన్ అఫ్రిది ఉన్నారు.

News December 10, 2025

MHBD: 3వ విడత అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు

image

మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. 3వ విడత అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో, వారు ఉదయం 6 గంటల నుంచే ప్రచారాన్ని వేగవంతం చేశారు. 2వ విడత పోలింగ్ 14న, 3వ విడత పోలింగ్ 17న ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు.