News March 11, 2025

HYDలో బయటకు వెళ్లాలంటే.. గొడుగు పట్టాల్సిందే!

image

గ్రేటర్ HYDలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. నేటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి మొదటివారంలోనే ఇంతటి ఉష్ణోగ్రత నమోదవ్వడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నగర ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే గొడుగు పట్టడం తప్పనిసరి అవుతోంది అని వారు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News November 21, 2025

సిటీలో మరో ఉపఎన్నిక.. 3 రోజుల తర్వాత క్లారిటీ!

image

సిటీలో మరో ఉపఎన్నిక రానుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ పార్టీ మార్పుపై స్పీకర్‌కు సమాధానం ఇవ్వలేదు. కాగా దానం‌కు స్పీకర్ 3రోజులు గడువిచ్చారు. ఈలోపు ఆయన నుంచి స్పందనరాకపోతే ‘అనర్హత’పై స్పీకర్ నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక్కడ ఉపఎన్నిక ఖరారైనట్లే.

News November 21, 2025

1956లో ప్రస్థానం ప్రారంభం.. నేటికి JNTUకి 60 ఏళ్లు

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. 1965లో నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలగా ఆవిర్భవించి 1972లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా అవతరించింది. 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకొని నేడు డైమండ్ జూబ్లీ వేడుకలకు యూనివర్సిటీ కళాశాల సిద్ధమైంది. ఈ 60 ఏళ్లలో ఎన్నో ఘనతలు సాధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.

News November 21, 2025

హైదరాబాద్ కలెక్టరేట్లో పానీ పరేషాన్

image

హైదరాబాద్ కలెక్టరేట్లో నీటి సమస్య నెలకొంది. నిత్యావసర పనులకూ నీరు లేక సిబ్బంది విలవిల్లాడుతున్నారు. పది రోజులుగా ఈ సమస్య నెలకొంది. పైప్‌లైన్ సమస్య కారణంగా నీటి ఇబ్బంది నెలకొంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగర వ్యాప్తంగా అనేక మంది సమస్యలతో కలెక్టరేట్‌కు వస్తుంటారు. ఇందులో నీటి సమస్య ఉండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.