News August 7, 2024
HYDలో బిత్తిరి సత్తిపై కేసు నమోదు
బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత గ్రంథాన్ని అపహాస్యం చేశారని, వ్యంగ్యంగా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేసింది. మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు తీసిన రవి కుమార్(బిత్తిరి సత్తి)పైన తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదులో పేర్కొంది.
Similar News
News September 10, 2024
HYD: మరణంలోనూ వీడని స్నేహం
షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్‌నగర్‌లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.
News September 10, 2024
HYD: విజేతలను అభినందించిన సీఎం రేవంత్
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 విజేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 విజేతగా సిరియా నిలిచింది. విన్నింగ్ టీమ్‌కు ఇంటర్ కాంటినెంటల్ కప్-2024ను సీఎం అందజేశారు. ఈ నెల 3న ఫుట్ బాల్ టోర్నమెంట్‌ను సీఎం రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
News September 10, 2024
హైదరాబాద్‌లో మొదలైన సందడి
HYDలో వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. 3 రోజుల పాటు పూజలు అందుకున్న చిట్టి గణనాథులు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నాయి. సోమవారం సా. నుంచే వందల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ఈ నెల 11, 13, 15, 17న ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ట్యాంక్‌బండ్‌కు వస్తారు. ‘జై బోలో గణేశ్ మహారాజ్‌కి జై’ నినాదాలతో HYD హోరెత్తనుంది.