News July 13, 2024
HYDలో బీఆర్ఎస్‌ను వీడుతున్నారు!

గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాజధానిలో 18 మంది BRS MLAలు గెలిచినా.. ఇప్పటికే ముగ్గురు INCలో చేరారు. మరికొందరు కూడా చేరుతారని హస్తం నేతలు చెబుతున్నారు. దీనికితోడు మున్సిపల్ ఛైర్ పర్సన్‌లు, కార్పొరేటర్లు క్యూ కట్టారు. జిల్లా స్థాయిలో కీలక నేతలు జంప్ అవడంతో గులాబీ శ్రేణులు అయోమయంలో పడుతున్నారు. శనివారం మరో BRS MLA కూడా పార్టీ మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Similar News
News February 14, 2025
HYD: కుంభమేళా టూర్.. యువకుడి మృతి (PHOTO)

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు బయలుదేరిన రంగారెడ్డి జిల్లా వాసులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌కు చెందిన వనం సంపత్ రాణా, వనం శ్రీనివాస్, చంద్రశేఖర్, రమేశ్, సాయి కారులో బయల్దేరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ శివారులో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో <<15456821>>సంపత్ రాణా<<>> అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. మృతుడి ఫైల్ ఫొటో పైన చూడొచ్చు.
News February 14, 2025
గచ్చిబౌలిలో ఏసీబీకి పట్టుబడ్డ ఏడీఈ

గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ACB అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ కుమార్ పట్టుబడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకు రూ.75వేలు డిమాండ్ చేశారు. వినియోగదారుల నుంచి ఇప్పటికే రూ.25 వేలు తీసుకున్నారు. కాగా, ఈరోజు మరో రూ.50 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ACB అధికారులు పట్టుకున్నారు.
News February 14, 2025
HYD: ఓయూ ఓపెన్ డిగ్రీ ప్రవేశ ప్రకటన

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ డిగ్రీ కోర్సుల రెండో విడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రవేశాలు UGC-దూరవిద్య బ్యూరో (DEB) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. అభ్యర్థులు www.osmania.ac.in లేదా oucde.net వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను పొందవచ్చు. దరఖాస్తుకు చివరి తేది 31 మార్చి 2025.