News March 5, 2025

HYDలో బీర్లపై పాత ధరలు.. ఇదేంటి?

image

HYDలో బీర్ సీసాలపై పాత ధరలే దర్శనమిస్తున్నాయని ఓ కస్టమర్ తెలిపారు. నాగోల్‌లోని వైన్ షాపులో బుధవారం బీఎస్ పాటిల్ అనే వ్యక్తి 2 బీర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. MRP మాత్రం రూ.210గా ఉంది. ఇటీవల పెంచిన ధరల ప్రకారం రూ.250కి అమ్మినట్లు పేర్కొన్నారు. లేబుల్స్‌పై పాత ధరలు ఉండటం ఏంటని నిలదీస్తే వైన్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. మీప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.

Similar News

News December 27, 2025

HYD: ఆశ్చర్యం.. కంటైనర్‌లో వైన్ షాప్

image

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే కంటైనర్‌లోనే వైన్ షాప్ ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజూరైన ఓ వైన్ షాప్ రెడీ కాకపోవడంతో దుకాణదారుడు రోడ్డు పక్కనే కంటైనర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ప్రధాన రహదారిపై ఇలా కంటైనర్‌లో వైన్ షాప్ నడపడం చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

News December 27, 2025

HYD: వీడియో వైరల్ చేస్తామని అమ్మాయికి బెదిరింపులు..!

image

వాట్సాప్‌లో అనుమానాస్పద లింక్స్ పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ పరిధిలో ఓ యువతికి లింక్ పంపి వీడియో కాల్ చేసిన తర్వాత వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. తెలియని లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News December 27, 2025

గ్రేటర్ HYDలో నీటి కష్టాలు

image

HYDలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉప్పల్‌లో 7.6 మీటర్లు, అమీర్‌పేటలో 10.5, కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 18.7, దారుల్‌షిఫా 7.1, టోలిచౌకి 3.8, రాజేంద్రనగర్ 7.6, శంషాబాద్ 4.6, వికారాబాద్ 4.8 మీటర్ల లోతుకు నీటి మట్టాలు చేరుకున్నట్లు వెల్లడించారు.