News March 20, 2025
HYDలో బొట్టు పెట్టుకున్న విశ్వ సుందరి!

మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా బేగంపేటలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మధ్యాహ్నం 12:00 గంటలకు హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ –2025 ప్రీ-లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంప్రదాయంలో చీర కట్టు, బొట్టు పెట్టుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘నమస్తే ఇండియా’ అని పలకరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడి ట్రెడిషన్ చాలా బాగా నచ్చింది అంటూ కితాబిచ్చారు.
Similar News
News December 13, 2025
HYD: ప్రముఖుల బసకు చిరునామా.. ఫలక్‌నుమా

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. దీని కోసం హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీకి ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస ఏర్పాటు చేసింది. ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రముఖులు బస చేసేందకు చిరునామాగా మారింది. దీన్ని 1893లో నిర్మించగా.. 1895 నుంచి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గెస్ట్ హౌస్‌గా వాడేవారు. ప్రస్తుతం తాజ్ గ్రూప్ ప్యాలెస్‌ను లీజ్ తీసుకుంది.
News December 13, 2025
హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. అత్యంత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు వణుకుతున్నారు. గత వారం రోజుల్లో అత్యల్పంగా సగటున 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, రాత్రి పొగ మంచు ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News December 13, 2025
రేవంత్ vs KTR: హైదరాబాదీలకు నిరాశ!

HYDకు తలమానికంగా రూ.75 కోట్లతో HMDA అభివృద్ధి చేసిన కొత్వాల్‌గూడ ఈకో పార్క్ ఇప్పుడు రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఈ పార్కు ఓపెనింగ్‌ను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని KTR విమర్శించారు. DEC 9న CM చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన పార్క్.. KTR విమర్శల కారణంగానే వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల కొట్లాటలో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం వంటి అద్భుతాలు చూడాలనుకున్న HYD ప్రజలకు నిరాశే మిగిలింది.


