News February 28, 2025

HYDలో భవన నిర్మాణాలకు పర్మిషన్లు ఈజీ

image

GHMC పరిధిలో ఇక నుంచి ఇంటి నిర్మాణాల పర్మిషన్లు వేగంగా జరుగుతాయని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. దీనికోసం ‘బిల్డ్ నౌ’ యాప్ తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై జోనల్, డిప్యూటీ కమిషనర్‌లకు మార్చి 9 వరకు శిక్షణ ఇస్తున్నారు. మార్చి 10 నుంచి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. AI ఆధారంగా పనిచేయడంతో ఇందులో ప్లాన్ అప్లోడ్ చేస్తే లోపాలు, కోర్టు కేసులు అన్నింటిని గుర్తిస్తుందని వివరించారు.

Similar News

News March 17, 2025

పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీ ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 18వ తేదీ (రేపు) నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

News March 17, 2025

HYDలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

image

హైదరాబాద్ జిల్లాలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి లోపం ఉన్నవారికి కంటి అద్దాలు అందిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొత్తం 71,309 మంది విద్యార్థుల్లో 8,849 మందికి కంటి సమస్యలు గుర్తించారు. 7,524 మందికి పునఃపరీక్షలు నిర్వహించి నాణ్యమైన కంటి అద్దాలు పంపిణీ చేశారు. విద్యార్థులు మొబైల్, టీవీ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

News March 17, 2025

జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్‌కు బెయిల్

image

జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు ఇవాళ్టికి వాయిదా వేసింది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు రేవతి, తన్వీ యాదవ్‌లకు బెయిల్ మంజూరు చేసింది. వారిపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.

error: Content is protected !!