News February 28, 2025
HYDలో భవన నిర్మాణ పర్మిషన్లు ఈజీ

GHMC పరిధిలో ఇక నుంచి ఇంటి నిర్మాణాల పర్మిషన్లు వేగంగా జరుగుతాయని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. దీనికోసం ‘బిల్డ్ నౌ’ యాప్ తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై జోనల్, డిప్యూటీ కమిషనర్లకు మార్చి 9 వరకు శిక్షణ ఇస్తున్నారు. మార్చి 10 నుంచి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. AI ఆధారంగా పనిచేయడంతో ఇందులో ప్లాన్ అప్లోడ్ చేస్తే లోపాలు, కోర్టు కేసులు అన్నింటిని గుర్తిస్తుందని వివరించారు.
Similar News
News November 21, 2025
సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనుగోలు చేయొచ్చు

AP: శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన బాబా స్మారక రూ.100 నాణేలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు. https://www.indiagovtmint.inలో మాత్రమే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280. నాణెంతోపాటు ఆయన జీవిత విశేషాల బుక్లెట్ కూడా అందుతుంది. ఆన్లైన్ పేమెంట్తో బుక్ చేసుకున్న నెల రోజుల్లోపు వీటిని ఇంటికి పంపుతారు.
News November 21, 2025
వాజేడు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి బదిలీ

వాజేడు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి బదిలీ అయ్యారు. ఐదేళ్లుగా విధులు నిర్వహించిన చంద్రమౌళిని అటవీ శాఖ ఉన్నతాధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు రేంజికి ఆయన్ను బదిలీ చేయగా విధుల్లో చేరారు. ఆయన స్థానంలో ప్రస్తుతం వెంకటాపురం(కే) రేంజర్ వంశీకృష్ణకు వాజేడు రేంజర్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
News November 21, 2025
ప.గో: గుండెపోటు.. నడుస్తున్న రైలులోనే ప్రాణం పోయింది!

రాజమండ్రికి చెందిన 67 ఏళ్ల వనమా లక్ష్మి నడుస్తున్న రైలులో గుండెపోటుకు గురై మృతి చెందింది. తన కుమార్తె గృహప్రవేశం నిమిత్తం విజయవాడకు బయలుదేరిన ఆమెకు దారి మధ్యలో గుండెపోటు రావడంతో ఏలూరు రైల్వే స్టేషన్లో దించి వైద్యం అందించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


