News March 9, 2025

HYDలో భారీగా తగ్గిన చికెన్ ధరలు

image

గతవారం రూ.193 ఉన్న స్కిన్‌లెస్ చికెన్ ధర నేడు రూ.140కి పడిపోయింది. ఫిబ్రవరి చివరివారంలో రూ.152 ఉండగా రంజాన్ ప్రారంభంలో ధరలు పెరిగాయి. ఈ వారం ఏకంగా రూ.50కిపైగా చికెన్ ధర పడిపోయింది. రిటైల్‌లో నేడు గుడ్ల ట్రే రూ.150గా ఉంది. పలు చోట్ల తెల్లవారు జామునుంచే మటన్, చేపల మార్కెట్ల వద్ద ప్రజలు బారులుతీరారు. మటన్ కిలో రూ.850-1000 వరుకు, చేపల రకాలని బట్టి కిలో రూ.200లకుపైగా విక్రయాలు జరుగుతున్నాయి.

Similar News

News March 24, 2025

ఉప్పల్: పడితే ‘పంచ’ప్రాణాలకు ముప్పే!

image

ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీస్తుందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే ఉప్పల్లో ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం. ఏకంగా బైక్ ట్యాంక్ మీద సైతం కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడా డ్రైవర్. ఇలా డ్రైవ్ చేయడం అంటే మన ప్రాణాలు మనమే తీసుకోవడమని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News March 24, 2025

రంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు ఇలా..

image

రంగారెడ్డి జిల్లాలో ఆదివారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కాసులాబాద్లో 37.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళ్‌పల్లిలో 36.6℃, హస్తినాపురం, ఎలిమినేడు 36.3, చుక్కాపూర్ 36.2, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, దండుమైలారం 35.7, చందానవెల్లి 35.4, మొగల్గిద్ద, వైట్‌గోల్డ్ SS 35.3, తొమ్మిదిరేకుల 35.1, అలకాపురి, గచ్చిబౌలి, మియాపూర్ 35.1, షాబాద్, కేతిరెడ్డిపల్లిలో 35℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 24, 2025

GHMCలో 27 మంది ఇంజినీర్ల తొలగింపు

image

GHMC కమిషనర్ ఇలంబర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. GHMC టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న న్యాక్ అవుట్ సోర్సింగ్ 27 మంది ఇంజినీర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణ, అక్రమాలకు పాల్పడుతున్నవారితో చెడ్డపేరు వస్తుందని, వీరిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. కొంతకాలంగా గ్రేటర్లో ఆక్రమణలపై ఇంజినీర్లు తనిఖీలు చేయకపోవడం, చేసినా చర్యలు తీసుకోకపోవడంతో తొలగించినట్లు తెలిపారు.

error: Content is protected !!