News March 9, 2025

HYDలో భారీగా తగ్గిన చికెన్ ధరలు

image

గతవారం రూ.193 ఉన్న స్కిన్‌లెస్ చికెన్ ధర నేడు రూ.140కి పడిపోయింది. ఫిబ్రవరి చివరివారంలో రూ.152 ఉండగా రంజాన్ ప్రారంభంలో ధరలు పెరిగాయి. ఈ వారం ఏకంగా రూ.50కిపైగా చికెన్ ధర పడిపోయింది. రిటైల్‌లో నేడు గుడ్ల ట్రే రూ.150గా ఉంది. పలు చోట్ల తెల్లవారు జామునుంచే మటన్, చేపల మార్కెట్ల వద్ద ప్రజలు బారులుతీరారు. మటన్ కిలో రూ.850-1000 వరుకు, చేపల రకాలని బట్టి కిలో రూ.200లకుపైగా విక్రయాలు జరుగుతున్నాయి.

Similar News

News November 28, 2025

వరంగల్: క్వార్టర్లకు పెరిగిన డిమాండ్!

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు మద్యం కిక్కు మొదలైంది. కొత్త షాపులు డిసెంబరు 1 నుంచి ప్రారంభం అవుతుండగా, ప్రస్తుత షాపులకు నేటి నుంచి మద్యం సరఫరా బంద్ చేశారు. మరోపక్క గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. రోజూ మందు, ముక్క క్యాంపులు మొదలయ్యాయి. ఎవరు పోటీ చేయాలనే దగ్గరి నుంచి పూర్తయ్యే వరకు మందుకు డిమాండ్ ఎక్కువ్వడం కామనే. వైన్ షాపుల్లో క్వార్టర్లు లేకపోవడంతో, వాటి కోసం అశావహులు వేట మొదలు పెట్టారు.

News November 28, 2025

MBNR: కొనసాగుతున్న చలి తీవ్రత

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. జిల్లాలో అత్యల్పంగా మిడ్జిల్ మండలం దోనూరులో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 14.1, రాజాపూర్ 14.4, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ 14.9, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.0, హన్వాడ 15.1, మిడ్జిల్ 15.2, మూసాపేట 15.5, మహమ్మదాబాద్ 15.7, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News November 28, 2025

ADB: బార్డర్లపై ఫోకస్ పెడితే బెటర్..!

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులంతా మహారాష్ట్ర బార్డర్లపై దృష్టిసారించాల్సిన అవసరముంది. ఎందుకంటే అక్కడి నుంచే అక్రమ మద్యం ADBలోకి తీసుకొచ్చే ఆస్కారముంది. అక్కడ అక్కడ తక్కువ ధరకు దొరికే దేశీదారును అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంచే అవకాశముంది. తలమడుగు, తాంసి, బేల, భీంపూర్, భైంసా, కుబీర్, జైనథ్, చింతలమానేపల్లి ఇలా సరిహద్దు మండలాల్లో చెక్‌పోస్టులు, తనిఖీలు పెంచాలి.